- Telugu News Photo Gallery Wearing smart watches? These diseases are sure to come, Check Here is Details
Smart Watches: స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ప్రస్తుత కాలంలో అందంగా కనిపించడం ఒక ఫ్యాషన్. ఈ ప్రపంచంలో దూసుకోవాలంటే అలాగే ఉండాలి మరి. ఈ క్రమంలోనే తెలియకుండా లేని పోని సమస్యలను తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇష్టంగా, ఫ్యాషన్‌గా ధరించే స్మార్ట్ వాచ్‌ల కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. స్మార్ట్ వాచ్ ల కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి..
Updated on: Dec 25, 2024 | 9:55 PM

వాచ్‌లు అందరూ ధరించడం కామన్ విషయం. వాచ్‌లు ధరించడం వల్ల ఎంతో హుందాగా కూడా కనిపిస్తూ ఉంటారు. కాలానుగుణంగా వాచ్‌లలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లు ఎంతో పాపులర్ అయ్యాయి.

ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మరీ వీటిని కొంటున్నారు. చూసేందుకు కూడా ఎంతో స్టైల్‌గా ఉంటున్నాయి. ఒక్క స్మార్ట్ వాచ్ ధరిస్తే చాలు.. ఎన్నో విషయాలు తెలుస్తాయి. అయితే స్మార్ట్ వాచ్‌లు ధరించే వారికి ఓ షాకింగ్ న్యూస్ కలవరానికి గురి చేస్తుంది.

స్మార్ట్ వాచ్‌లు ధరించడం వల్ల చర్మ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్ వాచ్ బాండ్ తయారీలో ఉపయోగించే పాటీ ఫ్లోరో అల్కైల్, పర్‌ప్లోరో హెక్సనోయిక్ యాసిడ్స్ శరీరంపై తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.

ఈ రసాయనాలు శరీరంలో అంత ఈజీగా కలిసిపోవు. వీటి కారణంగా సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్, చర్మ సమస్యలు, చర్మ క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దాదాపు 22 రకాల స్మార్ట్ వాచ్ బాండ్‌లను విశ్లేషించిన తర్వాత ఈ నిర్థారణకు వచ్చారు. రోజులో ఎక్కువ సేపు స్మార్ట్ వాచ్ ధరించే వారికి ఈ సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




