Health Benefits : ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ.. వారానికి ఒక్కసారైనా తింటే..

ఇది కేన్సర్‌ ను నివారిస్తుంది అని వెబ్‌ ఎండీ తెలిపింది. క్యాన్సర్‌ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. క్యాబేజీలో ఆంథోసైనిన్స్‌ ఉంటాయి. ఆర్థ్రరైటీస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.

Health Benefits : ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ.. వారానికి ఒక్కసారైనా తింటే..
Cabbage
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 25, 2024 | 9:53 PM

మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అలాగే, అన్ని కూరగాయలతో పాటు క్యాబేజీని కూడా తప్పనిసరిగా తినమని చెబుతుంటారు. క్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు. క్యాబేజీలో రోగనిరోధక శక్తి పెంచే గుణం ఉంటుంది. డయాబెటిక్‌, థైరాయిడ్ సమస్యలను సైతం క్యాబేజీ సమర్థంగా ఎదుర్కొంటుంది. క్యాబేజీ తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

క్యాబేజీలో ఎక్కువ శాతం నీరు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మనకు రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ అందిస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి మంచిది. క్యబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే, సీ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రాణాంతక గుండె, క్యాన్సర్‌ సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. క్యాబేజీలో యాంటీహైపర్‌గ్లైసెమిక్‌ గుణం కలిగి ఉంటుంది. ఇది మధుమేహం బాధితులకు మంచిది. డయాబెటిస్‌ నెఫ్రోపతి నుంచి కాపాడుతుంది.

క్యాబేజీలో గ్లూకోసైనోలేట్స్‌, సల్ఫర్‌ ఉంటుంది. అంతేకాదు క్యాబేజీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కేన్సర్‌ ను నివారిస్తుంది అని వెబ్‌ ఎండీ తెలిపింది. క్యాన్సర్‌ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. క్యాబేజీలో ఆంథోసైనిన్స్‌ ఉంటాయి. ఆర్థ్రరైటీస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.

ఇవి కూడా చదవండి

ఫైబర్‌ పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది కడుపు అల్సర్‌ రాకుండా చేస్తుంది. క్యాబేజీని డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగవుతుంది. ఫైబర్‌ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా మీ దరిచేరదు. శరీరంలో మంట వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో కేన్సర్‌, గుండె సమస్యలు, డయాబెటీస్‌, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.