చలికాలంలో కొబ్బరినీళ్లు ఈ టైంలో తాగితే.. మీ లివర్ సేఫ్!
25 December 2024
TV9 Telugu
TV9 Telugu
వేసవి తాపాన్ని తీర్చే పదార్థాల్లో కొబ్బరి నీళ్లు ముందు వరుసలో ఉంటాయి. అనేక పోషకాలు మిళితమై ఉండే కొబ్బరి నీళ్ల వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది
TV9 Telugu
వేసవిలో మాత్రమే అధికంగా తాగే కొబ్బరి నీళ్లను చలికాలంలోనూ సేవించాలంటున్నారు నిపుణులు. వినేందుకు వింతగా అనిపించినా చలికాలంలో కూడా కొబ్బరి నీళ్లు తాగాలట
TV9 Telugu
ఈ నీళ్లలోని చల్లని స్వభావం కారణంగా, శీతాకాలంలో వీటిని తాగడానికి చాలా మంది దూరంగా ఉంటారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం
TV9 Telugu
ముఖ్యంగా చలికాలంలో రోజూ కొబ్బరినీళ్లు మధ్యాహ్నం వేళల్లో తప్పనిసరిగా సేవించాలి. అలాగే సాయంత్రం 4 గంటల సమయంలోనూ సేవించవచ్చు. అయితే రాత్రిపూట మాత్రం కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిది
TV9 Telugu
చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే రాత్రిళ్లు వీటికి దూరంగా ఉండాలి. కానీ రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో ఉన్నందున పగటి పూట తాగాలి
TV9 Telugu
చలి కారణంగా చాలామంది ఈ కాలంలో తక్కువ నీరు తాగుతారు. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాదు చలికాలంలోనూ రోజూ కొబ్బరినీళ్లు తాగితే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది
TV9 Telugu
కొబ్బరి నీళ్లలోని సహజసిద్ధమైన ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడం ద్వారా నిర్విషీకరణ చేస్తాయి. పైగా కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది