భోజనం చేసిన తర్వాత సోంపు తింటే ఏమవుతంది? 

Velpula Bharath Rao

25 December 2024

సోంపులో పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ప్రోటీన్స్, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ సోంపు తినడం అనేది మన తాతల కాలం నుంచి ఉంది. 

భోజనం చేసిన తర్వాత సోంపు తినడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా.. సోంపు తినడంతో తొందరగా డైజెస్ట్ అవుతుంది. అజీర్తి సమస్యలు, కడుపులో నొప్పి వంటివి రాకుండా ఉంటాయి

భోజనం చేసిన తర్వాత సోంపు తినడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. మౌత్ ఫెషనర్‌గా ఈ సోంపు వర్క్ చేస్తూ ఉంటుంది.

 భోజనం తిన్న తర్వాత సోంపు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకుంటే సోంపు ఫుడ్‌ను త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో బాడీలో కొవ్వు నిలువ ఉండే అస్కారం లేదు. 

సోంపుకు ఆకలిని తగ్గించే గుణాలు ఉండడంతో.. ఆకలి ఎక్కువగా అనిపించదు. ఇలా బరువు తగ్గుతారు. రాత్రి సోంపును నానబెట్టి ఆ నీటిని తాగితే బరువు తగ్గుతారు.

 సోంపుకు క్యాన్సర్‌‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. సోంపులో ఎనిథోల్ అనే సమ్మేళనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్‌తో పోరాడుతుందని వారు తెలిపారు

ముఖ్యంగా ఈ సోంపు అనేది పాలిచ్చే తల్లులకు ఎంతోగాను మేలు చేస్తుంది. వాళ్లు సోంపు తినడం వల్ల పాలు సమృద్ధిగా పడుతాయి

 సోంపులో గలాక్టోజెనిక్ అనే గుణాలు ఉంటాయిని, అందుకే బాలింతలు సోంపును తీసుకోవడం మంచిదని వైద్య నిపుణలు సూచిస్తున్నారు.