Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs PBKS: చిత్తుగా ఓడిన బెంగుళూరు.. 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన పంజాబ్‌

RCB vs PBKS: ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది.

RCB vs PBKS: చిత్తుగా ఓడిన బెంగుళూరు.. 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన పంజాబ్‌
Rcb Vs Pbks
Follow us
uppula Raju

|

Updated on: May 14, 2022 | 12:04 AM

RCB vs PBKS: ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో పంజాబ్‌ 54 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. బెంగుళూరు ఏ దశలో లక్ష్యాన్ని ఛేదించే దిశగా కనిపించలేదు. గ్లెన్‌ మాక్స్‌వెల్ 35 పరుగులు, రజతత్‌ పాటిదర్ 26 పరుగులు, విరాట్‌ కోహ్లీ 20 పరుగులు మినహాయించి ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. పంజాబ్‌ బౌలర్లలో కాగిసో రబడా 3, రిషి ధావన్ 2, రాహుల్‌ చాహర్ 2, హర్‌ప్రీత్‌ 1, హర్ష్‌దీప్‌ సింగ్‌ 1 వికెట్‌ సాధించారు. దీంతో పంజాబ్‌ ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్నట్లు అయింది.

అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ తొలి నుంచి పరుగుల వర్షం కురిపించింది. జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడడంతో పంజాబ్‌ స్కోర్‌ బోర్డ్‌ దూసుకుపోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి కేవలం 30 బంతుల్లోనే 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అనంతరం ధావన్‌ వెనుదిరిగినా దూకుడుగా ఆడి కేవలం 29 బంతుల్లోనే 66 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ కూడా ఎక్కడా తగ్గలేదు. వరుస బౌండరీలతో స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. ఓవైపు వికెట్లు పడుతోన్నా జట్టు స్కోర్‌లో మాత్రం వేగం తగ్గకుండా చూసుకున్నాడు. 42 బంతుల్లో 70 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ బోర్డులో కీలక పాత్ర పోషించాడు. ఇక బెంగళూరు బౌలింగ్‌ విషయానికొస్తే.. హర్షల్‌ పటేల్‌ 4 ఓవర్లు వేసి 34 పరగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత హసరంగా 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి.. పలువురికి గాయాలు..

Vikram Controversy: కమల్‌ హాసన్‌ విక్రమ్ సినిమా సాంగ్‌పై రచ్చ.. కొన్ని పదాలకి భిన్నమైన అర్థాలు..!

Health Tips: ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారా.. పళ్లు పసుపు రంగులోకి మారుతాయి జాగ్రత్త..!