AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారా.. పళ్లు పసుపు రంగులోకి మారుతాయి జాగ్రత్త..!

Health Tips: దంతాలు ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దంతాలు పసుపు రంగులోకి

Health Tips: ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారా.. పళ్లు పసుపు రంగులోకి మారుతాయి జాగ్రత్త..!
Teeth
uppula Raju
|

Updated on: May 13, 2022 | 6:55 AM

Share

Health Tips: దంతాలు ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దంతాలు పసుపు రంగులోకి మారినప్పుడు ఇతరులతో మాట్లాడటానికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చాలా మంది దంతాల తెల్లబడటం కోసం దంతవైద్యుని వద్దకు వెళ్లే ఎంపికను ఎంచుకుంటారు. కానీ దీనికి చాలా డబ్బు ఖర్చవుతుంది. అక్కడ పళ్లను కెమికల్స్‌తో బ్లీచింగ్ చేస్తారు. అయితే ఇది అన్ని సార్లు మంచిది కాకపోవచ్చు. మన జీవనశైలితో పాటు మన ఆహారపు అలవాట్లు దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతున్నాయి. కొన్ని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పసుపురంగులోకి మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. బ్లాక్ కాఫీ

పళ్లను మరక చేసే నంబర్ 1 ఫుడ్ గురించి మాట్లాడితే.. అందులో బ్లాక్ కాఫీ ఖచ్చితంగా ఉంటుంది. కాఫీ ఎప్పుడైనా దంతాలకు మంచిది కాదు. బ్లాక్‌ కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మీరు కాఫీ తాగడం తగ్గిస్తే మంచిది.

2. టీ

మీలో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ రెగ్యులర్ గా టీ తాగడం వల్ల దంతాలు పాడవుతాయి. కానీ గ్రీన్ టీని తాగితే ఆరోగ్యానికి మంచిది.

3. రెడ్ వైన్

మీరు వైన్ తాగడానికి ఇష్టపడే వ్యక్తులలో ఒకరు అయితే ఈ విషయం మీకు నచ్చకపోవచ్చు. రెడ్ వైన్ వల్ల దంతాలలో గరుకు మచ్చలు ఏర్పడుతాయి. దీంతో దంతాల మధ్య నలుపు కూడా పెరుగుతుంది.

4. కోలా పానీయాలు

కూల్‌డ్రింక్స్‌, డార్క్ సోడా, డైట్ సోడా, ఇవన్నీ కడుపుకు మాత్రమే కాద దంతాలకు కూడా హానికరం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పసుపురంగులోకి మారుతాయి.

5. పొగాకు

పొగాకు తినే వారి నోరు మీరు తప్పక చూసే ఉంటారు. నోరు, దంతాల మరకలకు ఇది ఎక్కువగా కారణమవుతుంది. ఇది ఏ రకమైన పొగాకుతోనైనా జరగవచ్చు. సిగరెట్ తాగే వారి దంతాలు, పెదవులు చాలా నల్లగా ఉంటాయి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Karate Kalyani youtuber: కరాటే కల్యాణి, యూట్యూబర్‌ మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి..

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..

Health Tips: మీరు 40 ఏళ్లలో 20లా కనిపించాలంటే ఈ సూపర్ ఫుడ్ మీ డైట్‌లో ఉండాల్సిందే..!