Health Tips: మీరు 40 ఏళ్లలో 20లా కనిపించాలంటే ఈ సూపర్ ఫుడ్ మీ డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: ఆధునిక జీవనశైలిలో చాలామంది 40 సంవత్సరాల వయసులోనే చర్మం ముడతలు పడుతోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు,

Health Tips: మీరు 40 ఏళ్లలో 20లా కనిపించాలంటే ఈ సూపర్ ఫుడ్ మీ డైట్‌లో ఉండాల్సిందే..!
Badam
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: May 11, 2022 | 6:56 AM

Health Tips: ఆధునిక జీవనశైలిలో చాలామంది 40 సంవత్సరాల వయసులోనే చర్మం ముడతలు పడుతోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు, మానసిక ఒత్తిడి, పెరిగిన పొల్యూషన్, వ్యాయామం చేయకపోవడం, చెడ్డ ఆహారపు అలవాట్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయితే వీటి నుంచి బయటపడాలంటే ఒక్క సూపర్ ఫుడ్‌ మీ డైట్‌లో ఉండాలి. మీరు ప్రతిరోజు దీనిని తీసుకుంటే 40 ఏళ్లలో 20 ఏళ్లవారిలా కనిపిస్తారు. ఇంతకీ అ ఫుడ్‌ ఏంటనే కదా మీ అనుమానం. అది బాదంపప్పు మాత్రమే. కొంచెం ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది.

బాదంపప్పులను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌ కోసం మంచి ఎంపిక. వీటిలో నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రైబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్‌తో పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న బాదం గింజలలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, ఫైబర్, ప్లాంట్ బేస్ ప్రోటీన్, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు నిండి ఉంటాయి. అందువల్ల బాదం గుండెతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ ఏజింగ్‌లా పనిచేస్తుంది.

బాదం చర్మానికి చాలా మంచి నేచురల్ రెమెడీ అని చెప్పవచ్చు. ఇది 15 రకాల పోషకాలను కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ విటమిన్-ఇ పవర్‌హౌస్. ఇది ఫ్రీ రాడికల్స్, UV కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ప్రతిరోజూ బాదంపప్పు తినడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మంపై మెరుపుని కోల్పోనివ్వదు. ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి . 23 బాదంపప్పులు తినడం వల్ల మీ రోజువారీ విటమిన్-ఈ అవసరాలలో 50% తీర్చుకోవచ్చు.

బాదంపప్పులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ముడుతలని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి పోషణను అందిస్తుంది. విటమిన్-ఇ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించే కొన్ని యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి వృద్ధాప్య ప్రక్రియలో పెద్ద పాత్ర పోషిస్తాయి. బాదంపప్పును ఎక్స్‌ఫోలియేటర్‌గా ఉపయోగించవచ్చు. ఇది చర్మంలోని మలినాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది డెడ్‌ స్కిన్‌ని తొలగిస్తుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

IPL 2022 points table: ప్లే ఆఫ్‌ రేసులో కోల్‌కతా.. ముంబైపై విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు..!