IPL 2022 RCB vs PBKS Score: చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. బెంగళూరు ముందు భారీ విజయ లక్ష్యం..
IPL 2022 RCB vs PBKS Score: కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు ముందు 210 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు...
IPL 2022 RCB vs PBKS Score: కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు ముందు 210 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ తొలి నుంచి పరుగుల వర్షం కురిపించింది. జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడడంతో పంజాబ్ స్కోర్ బోర్డ్ దూసుకుపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి కేవలం 30 బంతుల్లోనే 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అనంతరం ధావన్ వెనుదిరిగినా దూకుడుగా ఆడి కేవలం 29 బంతుల్లోనే 66 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ కూడా ఎక్కడా తగ్గలేదు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. ఓవైపు వికెట్లు పడుతోన్నా జట్టు స్కోర్‌లో మాత్రం వేగం తగ్గకుండా చూసుకున్నాడు. 42 బంతుల్లో 70 పరుగులు సాధించి జట్టు స్కోర్ బోర్డులో కీలక పాత్ర పోషించాడు.
వీరిద్దరి తర్వాత శిఖర్ ధావన్ 2, మయాంక్ అగర్వాల్ 19, జితేశ్ శర్మ 9, హర్‌ప్రీత్ బ్రార్ 7, రిషిధావన్ 7, రాహుల్ చాహర్ 2 పరగులు చేశారు. ఇక బెంగళూరు బౌలింగ్ విషయానికొస్తే.. హర్షల్ పటేల్ 4 ఓవర్లు వేసి 34 పరగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత హసరంగా 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత మ్యాక్స్‌వెల్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.