AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Storing Hacks: ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

Egg Storing Hacks: చాలామంది మార్కెట్ల నుంచి ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తారు . దీని వెనుక రెండు కారణాలు ఉండవచ్చు. మొదట గుడ్లు చౌకగా లభిస్తాయి. రెండవది మార్కెట్‌కు మళ్లీ మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల కొన్నిసార్లు గుడ్లు చెడిపోతాయి

Egg Storing Hacks: ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Egg Storing Hacks
Basha Shek
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 15, 2022 | 8:34 AM

Share

Egg Storing Hacks: ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గుడ్డైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. గుడ్డులో పలు ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉంటాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. పైగా పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఈక్రమంలో చాలామంది మార్కెట్ల నుంచి ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తారు . దీని వెనుక రెండు కారణాలు ఉండవచ్చు. మొదట గుడ్లు చౌకగా లభిస్తాయి. రెండవది మార్కెట్‌కు మళ్లీ మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల కొన్నిసార్లు గుడ్లు చెడిపోతాయి. దీనికి ప్రధాన కారణం వాటిని నిల్వ చేసే విధానం. పాడైపోయిన గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కథనంలో, ఫ్రిజ్‌లో గుడ్లు ఎంతసేపు ఉంచాలి? అదేవిధంగా పాడైపోయిన గుడ్లను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం రండి.

ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుమారు నెల రోజుల పాటు ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ ఉంచవచ్చు. అదే బయటైతే మాత్రం ఒక వారం పాటు ఉండవచ్చు. అంతకుమించి నిల్వ ఉంచితే మాత్రం గుడ్లు చెడిపోతాయి.

ఇవి కూడా చదవండి

పాడైన గుడ్లను ఎలా గుర్తించాలంటే..

పాడైపోయిన గుడ్లను వాసన ద్వారా గుర్తించవచ్చు. ఒక పాత్రలో గుడ్డు పగులగొట్టి వాసన చూడండి. రెగ్యులర్‌ స్మెల్ కాకుండా చెడు వాసన వస్తున్నట్లయితే మాత్రం ఆ గుడ్లు పాడైపోయినట్లే.

నీటిలో ముంచడం ద్వారా..

చాలా రోజుల పాటు గుడ్లను నిల్వ ఉంచి అవి బాగున్నాయా? లేదా? అని గుర్తించాలంటే ఓ సింపుల్‌ చిట్కాను అనుసరించవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో గుడ్డును ముంచండి. గుడ్డు నీటిలో మునిగినట్లయితే అది మంచిగా ఉన్నట్లే. ఒకవేళ గుడ్డు నీటితో తేలితే మాత్రం అది పాడైపోయినట్లే నని భావించాలి. అదేవిధంగా గుడ్డు నీటిలో నిటారుగా నిలబడినా అది చెడిపోయినట్లే.

ఇలా కూడా..

పాడైపోయిన గుడ్లను ఇంకోలా కూడా గుర్తుపట్టవచ్చు. ఇందుకోసం గుడ్డును చెవి దగ్గర ఉంచుకుని షేక్‌ చేయాలి. రెగ్యులర్‌గా కాకుండా గుడ్డు నుంచి శబ్దాలు వస్తుంటే మాత్రం అది పాడైపోయినట్లేనని గ్రహించాలి. గుడ్లలో ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే చెడిపోయిన గుడ్లను తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

IPL 2022 KKR vs SRH Score: దంచికొట్టిన రస్సెల్‌.. హైదరాబాద్‌ లక్ష్యం ఎంతంటే..

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Mohanlal: చిక్కుల్లో మలయాళ సూపర్‌ స్టార్‌.. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు.. ఎందుకోసమంటే?