Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Railway News: తాజాగా మరిన్ని స్పెషల్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway). ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌- తిరుపతి- కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు SCR అధికారులు ప్రకటించారు.

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..
Trains
Follow us
Basha Shek

|

Updated on: May 14, 2022 | 6:21 PM

Railway News: కరోనా ప్రభావం తగ్గిపోవడంతో మునపటి రైళ్లను మళ్లీ పునరుద్ధరిస్తోంది రైల్వే శాఖ. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్ల (Special Trains)ను నడుపుతోంది. తాజాగా మరిన్ని స్పెషల్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway).  ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌- తిరుపతి- కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు SCR అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా 07433 నంబర్‌ గల రైలు మే17 న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

అదేవిధంగా 07434 నంబర్‌ గల రైలు మే 19న రాత్రి 8.25 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైళ్లు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూర్‌, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుంటూర్‌, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి. ఇక 07435 నంబర్‌ గల రైలు మే18న సాయంత్రం 4.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అదేవిధంగా 07436 నంబర్‌ గల రైలు మే19న ఉదయం 7.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గుడూర్‌, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడెపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు రైల్వే బుకింగ్ కేంద్రాలతో పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Mohanlal: చిక్కుల్లో మలయాళ సూపర్‌ స్టార్‌.. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు.. ఎందుకోసమంటే?

Ambati Rayudu: మరో ట్విస్ట్‌ ఇచ్చిన అంబటి రాయుడు.. రిటైర్మెంట్ ట్వీట్‌ డిలీట్‌.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో..

Fire Accident: అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం.. ఆస్పత్రిలో భారీగా ఎగసిపడుతోన్న మంటలు.. రోగుల ఆర్తనాదాలు..