Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: అద్దె ఇంటి కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా.? ఇలాంటి కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త..

Cyber Crime: ప్రస్తుతం ఆన్‌లైన్‌ యుగం నడుస్తోంది. ఇంట్లో కావాల్సిన కిరాణ సరుకు నుంచి పెద్ద పెద్ద వస్తువల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసుకునే రోజులు వచ్చాయి. ఇక ఇంటి కొనుగోళ్లు, ఇంటి అద్దెల వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు...

Cyber Crime: అద్దె ఇంటి కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా.? ఇలాంటి కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త..
Follow us
Narender Vaitla

|

Updated on: May 14, 2022 | 5:55 PM

Cyber Crime: ప్రస్తుతం ఆన్‌లైన్‌ యుగం నడుస్తోంది. ఇంట్లో కావాల్సిన కిరాణ సరుకు నుంచి పెద్ద పెద్ద వస్తువల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసుకునే రోజులు వచ్చాయి. ఇక ఇంటి కొనుగోళ్లు, ఇంటి అద్దెల వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒకప్పుడు అద్దె ఇంటి కోసం వెతకాలంటే రోడ్లపై తిరిగే వారు కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని స్మార్ట్‌ ఫోన్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. తమకు నచ్చిన ఏరియాలో, నచ్చిన ధరలో ఇళ్లను వెతుక్కొని ఆన్‌లైన్‌లోనే అడ్వా్న్స్‌లు ఇచ్చేస్తూ నేరుగా ఇంటికి వెళుతున్నారు.

అయితే యూజర్ల కోసం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని కొందరు నేరగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో తక్కువ అద్దెకే ఇళ్లు అంటూ ఆన్‌లైన్‌లో పోస్ట్‌లు చేస్తూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇంటిని వెంటనే బుక్‌ చేసుకోవాలంటూ ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌లను తీసుకుంటున్నారు. తీరా చూస్తే సదరు వ్యక్తులు ఫేక్‌ అని తెలుస్తోంది. దీంతో మోసపోయామని తెలుసుకున్న వారు లబోదిబోమంటున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఇదే విషయాన్ని తెలుపుతూ సైబరాబాద్ పోలీస్‌ అధికారులు ఓ ట్వీట్‌ చేశారు. అద్దె ఇళ్ల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి అని నెటిజన్లకు వివరించారు. ‘ఖరీదైన ప్రాంతాల్లో తక్కువ అద్దెకే ఇల్లు అంటారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవాలంటారు. వలలో పడ్డారో ఇక మీ డబ్బు పోయినట్టే. అద్దె ఇళ్ల కోసం ఆన్ లైన్ లో వెతికేటప్పుడు జాగ్రత్త అవసరం’ అంటూ రాసుకొచ్చారు. చూశారుగా అన్నింటికి ఆన్‌లైన్‌పైనే ఆధారపడకుండా నేరుగా ఇంటిని చూసిన తర్వాతే అడ్వాన్స్‌లు ఇస్తే ఇలాంటి మోసల బారిన పడకుండా ఉంటారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వామ్మో... ఈ ఎద్దు ఏంటి ఇలా దాడి చేస్తోంది.. ?
వామ్మో... ఈ ఎద్దు ఏంటి ఇలా దాడి చేస్తోంది.. ?
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆదాయపు పన్నులో మార్పులు.. రూ.12 లక్షల ఆదాయంపై జీరో ట్యాక్స్‌!
ఆదాయపు పన్నులో మార్పులు.. రూ.12 లక్షల ఆదాయంపై జీరో ట్యాక్స్‌!
ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు
ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో
చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్‌.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు
చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్‌.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్..ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే.!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్..ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే.!
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో
నిత్యానంద బ్యాగ్రౌండ్ ఏంట..? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి
నిత్యానంద బ్యాగ్రౌండ్ ఏంట..? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి
అప్పుల ఊబిలో అనిల్ అంబానీ సామ్రాజ్యం..
అప్పుల ఊబిలో అనిల్ అంబానీ సామ్రాజ్యం..