AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Flu: టొమాటో ఫ్లూతో జాగ్రత్త.. చిన్న పిల్లలే దీని టార్గెట్‌..!

Tomato Flu: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో టొమాటో ఫీవర్ కేసులు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న

Tomato Flu: టొమాటో ఫ్లూతో జాగ్రత్త.. చిన్న పిల్లలే దీని టార్గెట్‌..!
Tomato Flu
uppula Raju
|

Updated on: May 15, 2022 | 6:16 AM

Share

Tomato Flu: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో టొమాటో ఫీవర్ కేసులు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ జ్వరానికి గల అసలు కారణాలపై పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైద్యారోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలని నిర్వహిస్తోంది. టొమాటో ఫీవర్ లక్షణాలు దానిని ఎలా నివారించవచ్చో వివరంగా తెలుసుకుందాం.

టొమాటో జ్వరం అంటే ఏమిటి?

టొమాటో జ్వరం అనేది చిన్న పిల్లలపై దాడి చేసే ఒక రకమైన ఫ్లూ. అయితే దీనికి కారణాలు తెలియరాలేదు. దీని వెనుక డెంగ్యూ లేదా చికున్‌గున్యా కారణమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రకమైన ఫ్లూలో, పిల్లల చర్మంపై ఎర్రటి బొబ్బలు కనిపిస్తాయి. ఇవి టమోటాల ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని టొమాటో జ్వరం అంటారు. కేరళలో ఇది విలయతాండవం చేస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉంటే మంచిది. టొమాటో ఫ్లూ అనేది అంటు వ్యాధి. ఇది స్పర్శ ద్వారా సోకుతుంది. కాబట్టి మీ చుట్టూ ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉండండి. ముఖ్యంగా పిల్లలను రోగి దగ్గరికి రానివ్వవద్దు. ముఖ్యంగా ఇది పిల్లల్లో ఎక్కువగా సోకుతుంది.

టొమాటో జ్వరం లక్షణాలు

చర్మంపై ఎర్రటి బొబ్బలు, చర్మంపై దురద, కీళ్ల నొప్పులు, ముక్కు కారటం, అధిక జ్వరం, తిమ్మిరి, వాంతులు, దగ్గు, శరీర నొప్పులు, తుమ్ములు, విరేచనాలు, అలసట మొదలైనవి ఉంటాయి.

టొమాటో ఫీవర్ నివారించడం ఎలా?

మీ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఉంటే వాటిని గోకకుండా నిరోధించాలి. పిల్లలను వ్యాధి సోకిన రోగి నుంచి దూరంగా ఉంచాలి. వారి వస్తువులను ఉపయోగించకూడదు. సరైన సమయంలో వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Viral Photos: ప్రపంచంలోనే ప్రమాదకరమైన అడవి.. వెళ్లారంటే తిరిగి రావడం దాదాపు అసాధ్యమే..!

TS Police Recruitment 2022: పోలీసు ఉద్యోగాలకి గట్టి పోటీ.. ఒక్క రోజే 4.50 లక్షల దరఖాస్తులు..!