Beetroot Juice: వేసవిలో బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే బోలెడు ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Beetroot Juice: బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌ని క్రమంతప్పకుండా తీసుకోవడం

Beetroot Juice: వేసవిలో బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే బోలెడు ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Beetroot Juice
Follow us
uppula Raju

|

Updated on: May 17, 2022 | 3:11 PM

Beetroot Juice: బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌ని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బీట్‌రూట్‌లోని నైట్రేట్ కంటెంట్ రక్తపోటును తగ్గిస్తుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. మట్టిలోపల పండే దుంపలు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయని చెబుతారు. బీట్ రూట్ ఆ కోవకి చెందినదే. ఇందులో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది చర్మ సమస్యలని తొలగిస్తుంది.

బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. బీట్‌రూట్‌లో సహజ రసాయనమైన నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని సులభతరం చేయడానికి ఇది సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ అలసటను తగ్గిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా బీట్‌రూట్ తినడానికి వెనుకాడతారు. కానీ దీనిని మితంగా తీసుకుంటే వారికి కూడా మంచిదే. బీట్‌రూట్ జ్యూస్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు బీట్‌రూట్‌ని అన్ని విధాలా వాడవచ్చు. బీట్ రూట్ జ్యూస్‌లో కొద్దిగా అల్లం కలిపి తాగితే జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. బీట్‌రూట్ జ్యూస్‌లో వెనిగర్ వేస్తే డ్రై స్కాల్ప్ సమస్య తగ్గుతుంది.

స్థూలకాయ సమస్యను తగ్గించడం దీర్ఘకాలిక మంట, కాలేయ సంబంధిత వ్యాధులు, ఊబకాయం, క్యాన్సర్‌తో బాధపడేవారికి బీట్‌రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్యని పరిష్కరిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దంతాల సమస్యలని నివారిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

World Hypertension Day 2022: హైబీపీ పేషెంట్లు మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!

Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అంటే ఈ విటమిన్‌ లేదని అర్థం..!

IPL 2022 Points Table: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన రాజస్థాన్.. లక్నో సూపర్ జెయింట్స్‌కి పొంచి ఉన్న ప్రమాదం..!