Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అంటే ఈ విటమిన్‌ లేదని అర్థం..!

Health Tips: శరీరంలో ఏవైనా మార్పులు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ మార్పులు తీవ్రమైన వ్యాధికి సూచన కావొచ్చు. మీరు విటమిన్‌ బి6 గురించి తెలుసుకోవాలి.

Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అంటే ఈ విటమిన్‌ లేదని అర్థం..!
Vitamin B6 Symptoms
Follow us

|

Updated on: May 16, 2022 | 6:56 AM

Health Tips: శరీరంలో ఏవైనా మార్పులు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ మార్పులు తీవ్రమైన వ్యాధికి సూచన కావొచ్చు. మీరు విటమిన్‌ బి6 గురించి తెలుసుకోవాలి. చాలా మంది ప్రజలు ఈ విటమిన్‌ను ఆహారం ద్వారా తీసుకుంటారు. కానీ మీకు ఫోలేట్, బి-12 వంటి ఇతర విటమిన్ల లోపం ఉంటే శరీరంలో విటమిన్-బి6 లోపం కూడా ఏర్పడుతుంది. కాలేయం, కిడ్నీకి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నవారిలో లేదా ధూమపానం చేసేవారిలో ఈ లోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్-బి6 లోపం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసుకుందాం.

1. చర్మంపై మచ్చలు

మీ శరీరంలో ఒక రకమైన దద్దుర్లు కనిపిస్తే వాటిని తేలికగా తీసుకోవద్దు. నిజానికి ఇవి విటమిన్-బి-6 లోపం వల్ల సంభవించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

2. పగిలిన పెదవులు

మారుతున్న సీజన్‌లో పెదవులు పగలడం అనేది సహజం. కానీ ప్రతిసారి అలా జరగదు. కాబట్టి ఈ లక్షణాన్ని తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే విటమిన్-బి 6 లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

3. నాలుకపై మార్పులు

మీ నాలుక నొప్పిగా ఉంటే తేలికగా తీసుకోకండి. బొబ్బల వల్ల లేదా ఏదైనా ఇతర సమస్య వల్ల నొప్పి వస్తుందని విస్మరించవద్దు. విటమిన్-బి6 లోపం వల్ల కూడా నాలుక నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

4. మూడ్ స్వింగ్స్ కలిగి ఉండటం

చాలా మందికి క్షణ క్షణానికి మూడ్ స్వింగ్ ఉంటుంది. శరీరంలో విటమిన్-బి6 లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Viral Video: ఆవు ప్రేమ తల్లి ప్రేమ ఒక్కటే.. యజమానిపై దాడి చేస్తే ఊరుకుంటుందా..!

Fenugreek: మెంతులతో చుండ్రు సమస్యలకి చెక్‌.. ఈ విధంగా చేయండి..!

Peppermint Tea: పుదీనా టీ తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!