AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inflation: దేశంలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. 24 ఏళ్ల తర్వాత 15.08 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం..

దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) రోజురోజుకి పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం(Food), ఇంధనం, విద్యుత్(Power) ధరల పెరుగుదల కారణంగా టోకు ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలలో రెండంకెల స్థాయిలోనే కొనసాగుతోంది. ..

Inflation: దేశంలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. 24 ఏళ్ల తర్వాత 15.08 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం..
Inflation
Srinivas Chekkilla
|

Updated on: May 17, 2022 | 3:24 PM

Share

దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) రోజురోజుకి పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం(Food), ఇంధనం, విద్యుత్(Power) ధరల పెరుగుదల కారణంగా టోకు ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలలో రెండంకెల స్థాయిలోనే కొనసాగుతోంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 15.08 శాతానికి చేరుకుంది. టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్ 1998 తర్వాత మొదటిసారిగా 15% దాటింది. డిసెంబర్ 1998లో ఇది 15.32% వద్ద ఉంది. మార్చి 2022లో 14.55% వద్ద ఉండగా, ఫిబ్రవరిలో 13.11% వద్ద ఉంది. ఏప్రిల్ 2021 నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలోనే ఉంది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రేటు 8.35% కాగా మార్చి 8.06 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ముడి పెట్రోలియం, సహజ వాయువు ద్రవ్యోల్బణం 69.07%గా ఉంది. అదే సమయంలో ఇంధనం, శక్తి ద్రవ్యోల్బణం 38.66%కి పెరిగింది. ఇది మార్చి 2022లో 34.52%. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చి 2022లో 10.71% నుండి ఏప్రిల్‌లో 10.85%కి చేరింది.

కూరగాయలు, గోధుమలు, పండ్లు, బంగాళదుంపల ధరలు ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్‌లో బాగా పెరిగాయి. ఇది ఆహార ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమయ్యాయి. చమురు, విద్యుత్ విషయానికొస్తే, ద్రవ్యోల్బణం రేటు 38.66%, తయారీ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం రేటు 10.85, నూనెగింజలు ద్రవ్యోల్బణం 16.10 శాతంగా ఉంది. చమురు, ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి పెరిగింది. ఇది మే 2014లో ద్రవ్యోల్బణం 8.32% ఉంది. భారతదేశంలో ద్రవ్యోల్బణం రెండు రకాలు. ఒకటి రిటైల్ ద్రవ్యోల్బణం, మరొకటి టోకు ద్రవ్యోల్బణం. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సాధారణ కస్టమర్లు అందించే ధరలపై ఆధారపడి ఉంటుంది. దీనిని వినియోగదారుల ధర సూచిక (CPI) అని కూడా అంటారు. అయితే, హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) అనేది హోల్‌సేల్ మార్కెట్‌లోని ఒక వ్యాపారి మరొక వ్యాపారికి వసూలు చేసే ధరలను సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

Read Also.. LIC IPO: అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి.. నిరాశ పరిచిన ఎల్ఐసీ ఐపీవో లిస్టింగ్.. పూర్తి వివరాలు