Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులను నిరాశపరిచిన ఎల్‌ఐసీ ఐపీఓ..
మెటల్, ఎనర్జీ స్టాక్‌ల లాభాల కారణంగా వరుసగా రెండవ సెషన్‌లో మంగళవారం స్టాక్ మార్కెట్లు(Stock Market) లాభాల్లో ముగిశాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (LIC) స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది...
మెటల్, ఎనర్జీ స్టాక్‌ల లాభాల కారణంగా వరుసగా రెండవ సెషన్‌లో మంగళవారం స్టాక్ మార్కెట్లు(Stock Market) లాభాల్లో ముగిశాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (LIC) స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. LIC షేర్లు ప్రారంభ ట్రేడ్‌లో రూ. 949 ఇష్యూ ధరపై 8.62 శాతం తగ్గింపుతో లిస్టయ్యాయి. BSEలో ఈ స్టాక్ 8.04 శాతం తగ్గి రూ. 872.70 వద్ద స్థిరపడింది. NSEలో LIC మొదటి రోజు ట్రేడింగ్‌లో 8.01 శాతం పడిపోయి రూ. 873 వద్ద స్థిరపడింది. 30-షేర్ల బిఎస్‌ఈ సెన్సెక్స్ 1,345 పాయింట్లు పెరిగి 54,318 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 16,259 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 2.73 శాతం, స్మాల్ క్యాప్ 3.36 శాతం పెరిగాయి. సబ్-ఇండెక్స్‌లు నిఫ్టీ మెటల్ 6.86, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 3.68 శాతం పెరిగాయి.
హిండాల్కో 9.80 శాతం పెరిగి రూ. 429.25కి చేరుకోవడంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా స్టీల్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ కూడా లాభపడ్డాయి. 30 షేర్ల బిఎస్‌ఇ ఇండెక్స్‌లో టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటిసి, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, ఎల్ అండ్ టి, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, టైటన్, ఎస్‌బిఐ, టిసిఎస్ లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ త్రైమాసిక ఆదాయ ఫలితాల కంటే ముందు వరుసగా 1.79 శాతం, 1.80 శాతం పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..