Ratan Tata Foundation: వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాపై రతన్‌ టాటా హెచ్చరిక..

ఈ మధ్య నకిలీ ఫేస్‌బుక్‌(Facebook) ఖాతాల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది ప్రోఫైల్‌తో సైబర్‌ నేరగాళ్లు ఖాతాలు సృష్టించి డబ్బులు అడుగుతున్నారు...

Ratan Tata Foundation: వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాపై రతన్‌ టాటా హెచ్చరిక..
Ratan Tata
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 17, 2022 | 5:29 PM

ఈ మధ్య నకిలీ ఫేస్‌బుక్‌(Facebook) ఖాతాల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది ప్రోఫైల్‌తో సైబర్‌ నేరగాళ్లు ఖాతాలు సృష్టించి డబ్బులు అడుగుతున్నారు. దీంతో అసలైనవారు తమ పేరుతో నకిలీ ఖాతా తెరిచారని.. వారు డబ్బులు అడుగుతున్నారని.. వారిని నమ్మకండి అని కోరుతున్నారు. అయితే ఈ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల సమస్య ఒక సాధారణ వ్యక్తులకే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎదుర్కొంటున్నాయి. తాజాగా ‘రతన్ టాటా ఫౌండేషన్’ ఫేస్‌బుక్ పేజీ పేరుతో నకిలీ ఖాతా సృష్టించి డబ్బులు అడుగుతున్నారని రతన్ టాటా(Ratan tata) స్వయంగా చెప్పారు. టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ రతన్ టాటా ఈ ఉదయం Instagram స్టోరీస్‌లో ఫేస్‌బుక్ పేజీ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. “రతన్ టాటా ఫౌండేషన్ పేజీ, ఒక స్వచ్ఛంద సంస్థగా తనను తాను ముద్రించుకుందని.. ఇది రాసే సమయంలో ఫేస్‌బుక్ నుంచి నకిలీ ఖాతా తొలగించారని” రతన్ టాటా అన్నారు. “సహాయానికి బదులుగా డబ్బు కోసం నా సహోద్యోగుల పేర్లను ఉపయోగించి, అమాయక పౌరులను మోసగిస్తున్న ఈ మోసపూరిత పేజీ గురించి మీకు తెలియజేయడానికి ఇది” అని రతన్‌ టాటా పేర్కొ్న్నారు.

పేజీని సృష్టించిన వారిపై తమ బృందం “కఠినమైన చట్టపరమైన చర్యలు” తీసుకుంటుందని రతన్ టాటా చెప్పారు. Talktous@tatatrusts.orgకి వ్రాయడం ద్వారా టాటా పేరును ఉపయోగించే పేజీలు, కంపెనీల ప్రామాణికతను ధృవీకరించవలసిందిగా అతను తన అనుచరులను కోరాడు. టాటా ట్రస్ట్స్ అనేది టాటా సన్స్ దాతృత్వ విభాగం. 1919లో రతన్ టాటా ట్రస్ట్ స్థాపించబడినప్పటికీ, రతన్ టాటా ఫౌండేషన్ పేరుతో దీనికి ఎటువంటి సంస్థ లేదు. ప్రజలు తమ పేరును ఉపయోగించుకునే సమస్యను ఎదుర్కొన్న మొదటి పారిశ్రామికవేత్త టాటా కాదు. గత సంవత్సరం, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఇదే సమస్యను ఎదుర్కొ్న్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…