side effects of pineapple: పైనాపిల్‌ ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

జ్యూస్ అంటే దాదాపు అందరికి పైనాపిల్‌(Pineapple) గుర్తొస్తుంది. ఎందుకంటే పైనాపిల్‌ ఎక్కువగా జ్యూస్‌(Juice) రూపంలో తీసుకుంటారు...

side effects of pineapple: పైనాపిల్‌ ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
Pineapple
Follow us

|

Updated on: May 17, 2022 | 2:50 PM

జ్యూస్ అంటే దాదాపు అందరికి పైనాపిల్‌(Pineapple) గుర్తొస్తుంది. ఎందుకంటే పైనాపిల్‌ ఎక్కువగా జ్యూస్‌(Juice) రూపంలో తీసుకుంటారు. చాలా మంది ఎండ కాలంలో పైనాపిల్ తినడానికి ఇష్టపడతారు. కొందరైతే కట్ చేసిన పైనాపిల్ తింటే, మరికొందరు జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది అల్పాహారంలో పైనాపిల్ జ్యూస్ తాగితే, మరికొందరు దీన్ని స్నాక్‌గా తీసుకుంటారు. మీరు పైనాపిల్‌ను అధిక పరిమాణంలో తీసుకుంటున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎక్కువ తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైనాపిల్‌లో విటమిన్ సి(vitamin C) చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే అధిక మెుత్తంలో శరీరానికి విటమిన్ సి అందుతుంది. అంతేకాకుండా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్ తినకుండా ఉండాలి. పైనాపిల్లో తీపి చాలా ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల చాలా మందికి అలర్జీ సమస్యలు, గొంతు నొప్పి కూడా వస్తాయట. మీరు ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్లయితే పైనాపిల్ తినడం మానేయడం మంచిది. దంత సమస్యలతో బాధపడేవారు కూడా పైనాపిల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో తీపి ఎక్కువగా ఉండటం వల్ల దంతాలలో సున్నితత్వ సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా దీనిని అతిగా తీసుకోవడం వల్ల క్యావిటీ వంటి సమస్యలు కూడా వస్తాయట. వర్క్‌అవుట్‌లు చేసేవారికి పైనాపిల్ జ్యూస్‌ బాగా పనిచేస్తుంది.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనలు, సలహాల మేరకు మీకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.

Read Also.. Betel Leaves: తమలపాకులు ఈ 5 సమస్యలను తొలగిస్తాయి.. ఈ ప్రయోజనాలు తెలిస్తే మీరు షాకవుతారు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ