Fitness Tips: మీ పిల్లలను స్విమ్మింగ్‌పూల్‌కు పంపిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందే..
Swimming Tips: వేసవిలో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది స్విమ్మింగ్. గంటల తరబడి నీళ్లలో ఉన్నా పిల్లల మనసు నిండదు. అయితే ఈత కొట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ..
Swimming Tips: వేసవిలో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది స్విమ్మింగ్. గంటల తరబడి నీళ్లలో ఉన్నా పిల్లల మనసు నిండదు. అయితే ఈత కొట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో పిల్లలకు (Children)వ్యాయామం కూడా అవుతుంది. అయితే పిల్లలు స్విమ్మింగ్ చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండ స్విమ్మింగ్ పూల్‌లోనే ఈత కొట్టాలి. అలాగే శిక్షకుల పర్యవేక్షణ ఉన్న స్విమ్మింగ్ పూల్‌నే ఎంచుకోవాలి. ఈత కొట్టడం వల్ల ఫిట్‌నెస్ బాగానే ఉంటుంది. ఈత కొట్టేటప్పుడు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. దీంతో అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈత కొట్టడానికి వెళితే ఈ 5 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి.
- సన్‌స్క్రీన్ అప్లై చేయండి- మీరు స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లినప్పుడు, ముందుగా మీ చేతులకు, ముఖానికి వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. దీని వల్ల స్విమ్మింగ్ పూల్ నీళ్ల వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగదు.
- పూల్‌కు వెళ్లే ముందు, తర్వాత స్నానం చేయండి: స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లే ముందు చర్మ కణాలను హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో కణాలను హైడ్రేట్‌గా ఉంచడానికి స్నానం చేయండి, తద్వారా మీరు క్లోరిన్ నీటిలోకి అడుగుపెట్టినప్పుడు, మీ చర్మ కణాలు పొడిగా ఉండవు. కానీ హైడ్రేట్ అవుతాయి. ఇది క్లోరిన్ నీటి ప్రభావాన్ని రివర్స్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది చర్మంపై ప్రభావం చూపదు. అలాంటి పరిస్థితుల్లో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది క్లోరిన్ ఎలాంటి ప్రభావాన్ని అయినా తొలగిస్తుంది. స్నానం చేసిన తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి. తద్వారా మీ చర్మం పరిపూర్ణంగా ఉంటుంది.
- తలకు టోపీ పెట్టుకోండి: ఈత కొట్టేవారి చెవుల్లోకి నీరు తరచుగా వెళ్తుంది. దీని కోసం మీరు పూల్‌కి వెళ్లినప్పుడు మీరు తప్పనిసరిగా స్విమ్మింగ్ క్యాప్ ధరించాలి. పిల్లలకు కూడా క్యాప్ పెట్టండి. కావాలంటే క్యాప్ లోపల ఇయర్ బడ్స్ కూడా పెట్టుకోవచ్చు. దీని వల్ల చెవిలో నీరు పడదు. ఇన్ఫెక్షన్ కూడా ఉండదు.
- పూల్ నీరు త్రాగవద్దు: స్విమ్మింగ్ పూల్ నీటిలో క్లోరిన్ ఉంటుంది. ఇది కడుపులోకి చేరడం ద్వారా హాని కలిగిస్తుంది. అందుకే పొరపాటున కూడా ఈ నీటిని తాగకండి. అలాగే పూల్ వాటర్ తాగకూడదని పిల్లలకు వివరించండి. ఇది వాంతులు లేదా ఇతర కడుపు సమస్యలను కలిగిస్తుంది.
- కళ్ళు, జుట్టును జాగ్రత్తగా చూసుకోండి: స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువసేపు ఉండటం వల్ల కళ్ళు ఎర్రగా మారుతాయి. అందుకే కళ్లజోడు పెట్టుకోవాలి. అదే సమయంలో జుట్టు సంరక్షణ కూడా ముఖ్యం. జుట్టును కండిషనింగ్ చేస్తూ తేలికపాటి షాంపూతో కడగాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనలు, సలహాల మేరకు మీకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి