AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care in Summer: వేసవిలో చెమట వల్ల మీ ముఖంపై మొటిమలు ఏర్పడుతున్నాయా..? ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది!

Skin Care in Summer: చర్మంపై మొటిమలు ఏర్పడటానికి ఒత్తిడి, టీ తాగడం లేదా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటివి కారణం కావచ్చు. అయితే చర్మంపై మొటిమలు కనిపించడానికి వేసవిలో వచ్చే చెమట కూడా కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో చెమటలు పట్టడం మామూలే కానీ దాని వల్ల వచ్చే సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. చెమట, ఇతర కారణాల వల్ల వచ్చే మొటిమలు మరింతగా బాధిస్తాయి. అవి పెరిగితే, చర్మంలో దురద […]

Skin Care in Summer: వేసవిలో చెమట వల్ల మీ ముఖంపై మొటిమలు ఏర్పడుతున్నాయా..? ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది!
Subhash Goud
|

Updated on: May 18, 2022 | 9:14 AM

Share

Skin Care in Summer: చర్మంపై మొటిమలు ఏర్పడటానికి ఒత్తిడి, టీ తాగడం లేదా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటివి కారణం కావచ్చు. అయితే చర్మంపై మొటిమలు కనిపించడానికి వేసవిలో వచ్చే చెమట కూడా కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో చెమటలు పట్టడం మామూలే కానీ దాని వల్ల వచ్చే సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. చెమట, ఇతర కారణాల వల్ల వచ్చే మొటిమలు మరింతగా బాధిస్తాయి. అవి పెరిగితే, చర్మంలో దురద కూడా మొదలవుతుంది. కొన్నిసార్లు చర్మం చెమటను, దానిపై పేరుకునే మురికిని పీల్చుకుంటుంది. ఈ మొటిమలు తెరిచిన రంధ్రాల్లాగా ఏర్పడతాయి. చెమట వల్ల వచ్చే మొటిమల వల్ల కూడా మీరు ఇబ్బంది పడుతుంటే, ఈ చిట్కాలను పాటించండి.

పసుపు, తేనె, పాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు చర్మ నిపుణులు. చెంచా పసుపు, తేనె, పాలు కలిపి మంచి క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై రాయాలి. కాస్తా ఆరాక నీటిని స్ప్రే చేసి మెల్లిగా రుద్దుతూ చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలావరకూ తగ్గుతుంది.

కలబంద, పసుపు ప్యాక్..కలబందలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఎంజైమ్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు మొటిమలు తయారయ్యేందుకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి సమస్యను అదుపు చేస్తుంది. ఇది పొడి చర్మం వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. మీరు మాయిశ్చరైజర్‌తో కూడిన సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తుంటే దానిని ఉపయోగించాల్సిన సరైన మార్గాన్ని నిపుణుల నుండి తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

అలాగే సిట్రస్ జాతి పండ్లు నిమ్మ, నారింజ వంటివి చర్మంలోని బ్యాక్టీరియాను పోగొట్టి మొటిమలను దూరం చేస్తాయి. ఈ ప్యాక్స్ వేసుకోవడం వల్ల ముఖం తాజాగా మారి అందంగా కనిపిస్తారు. అలాగే కీర దోస వల్ల కూడా మొటిమలను తొలగించుకోవచ్చు. కీర దోసను తీసుకుని దానిపై తొక్కను తొలగించి లోపలి భాగాన్ని ఫేస్ట్‌లా చేసుకుని అందులో బార్లీ పిండిని కలపాలి. ఈ రెండింటిని ముద్దలాగా చేసి ఎక్కడైతే మీకు మొటిమలు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. అలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా మూడు నెలల పాటు వారానికి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి