AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World AIDS Vaccine Day 2022: నేడు ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ దినోత్సవం.. కానీ ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ కనుగొనలేదు.. కారణం ఏంటంటే..?

World AIDS Vaccine Day 2022: ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఎయిడ్స్ నివారణ, హెచ్‌ఐవి వ్యాక్సిన్

World AIDS Vaccine Day 2022: నేడు ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ దినోత్సవం.. కానీ ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ కనుగొనలేదు.. కారణం ఏంటంటే..?
World Aids Vaccine Day 2022
uppula Raju
|

Updated on: May 18, 2022 | 1:37 PM

Share

World AIDS Vaccine Day 2022: ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఎయిడ్స్ నివారణ, హెచ్‌ఐవి వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని 1997లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రారంభించారు. మోర్గాన్ స్టేట్ యూనివర్శిటీలో చేసిన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘ హెచ్‌ఐవి వ్యాక్సిన్ మాత్రమే ఎయిడ్స్ ప్రమాదాన్ని తగ్గించగలదు, అంతిమంగా తొలగించగలదు’. రాబోయే దశాబ్దంలో హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ను తయారు చేయడం గురించి ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1998 మే 18న మొదటిసారిగా ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఈ రోజును జరుపుకునే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఎయిడ్స్‌కి సమర్థవంతమైన చికిత్స నేటికీ కనుగొనలేదు. నేటికీ ఎయిడ్స్ నయం చేయలేని వ్యాధిగా మిగిలిపోయింది.

ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధిని నిర్మూలించడానికి ఏళ్ల తరబడి నిరంతర పరిశోధనలు, ప్రయోగాలు జరుగతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదకరమైన వైరస్‌ను చంపడానికి ఇప్పటివరకు ఎవ్వరూ వ్యాక్సిన్ తయారు చేయలేదు. వాస్తవానికి ఈ వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముందుగా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తర్వాత ఇతర అవయవాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. రోజు రోజుకి అతడు వ్యాధితో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతాడు. క్రమంగా మరణ స్థితికి చేరుకుంటాడు.

అయితే HIVని చంపే టీకా ఇంకా తయారు కాలేదు. కానీ ఎయిడ్స్‌తో బాధపడుతున్న వ్యక్తుల కోసం కొన్ని మందులు వచ్చాయి. ఇవి శరీరంలోని HIV వైరస్ మొత్తాన్ని నియంత్రించగలవు. ఈ మందులను ART అంటారు. ART ద్వారా HIV వైరస్ దాదాపు ఆరు నెలల్లో కంట్రోల్‌ అవుతుంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యసేవలు అందిస్తే వారి ఆయుష్షును పొడిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) అనేది ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై నేరుగా దాడి చేసే వైరస్. హెచ్‌ఐవీతో బాధపడుతున్న వ్యక్తి శరీరంలో తెల్ల రక్తకణాలు తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరం ఎలాంటి వ్యాధితోనూ పోరాడలేకపోతుంది. ఈ పరిస్థితిలో ఈ వ్యాధి శరీరం మొత్తం వ్యాపిస్తుంది. చివరికి మరణానికి దారితీస్తుంది.

AIDS సాధారణ లక్షణాలు

నోటిలో తెల్లటి మచ్చలు, విపరీతమైన అలసట, ఆకస్మికంగా బరువు తగ్గడం, అధిక జ్వరం, విపరీతమైన చెమట, తరచుగా విరేచనాలు, నిరంతర దగ్గు, గొంతు, తొడలు, చంకలలో వాపు, గడ్డలు, శరీరంలో దురద, న్యుమోనియా, క్షయ, చర్మ క్యాన్సర్ మొదలైనవి ఎయిడ్స్ లక్షణాలలో ఉంటాయి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి