AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mileage Bikes: సామాన్యులకి అందుబాటులో ఉండే ధర.. లీటర్‌కి 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ..!

Mileage Bikes: బైక్ కొనేటప్పుడు చాలా విషయాలు మనసులో మెదులుతాయి. అలాంటి సమయంలో కొనుగోలుదారులు బైక్ మెయింటనెన్స్‌ ఖర్చు,

Mileage Bikes: సామాన్యులకి అందుబాటులో ఉండే ధర.. లీటర్‌కి 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ..!
Mileage Bikes
uppula Raju
|

Updated on: May 18, 2022 | 9:21 AM

Share

Mileage Bikes: బైక్ కొనేటప్పుడు చాలా విషయాలు మనసులో మెదులుతాయి. అలాంటి సమయంలో కొనుగోలుదారులు బైక్ మెయింటనెన్స్‌ ఖర్చు, ఇంజిన్ పవర్ మొదలైన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా మైలేజీకి పెద్ద పీట వేస్తారు. దేశంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు కార్ల యజమానుల జేబులకు చిల్లు పడడమే కాకుండా ద్విచక్ర వాహనదారులపైనా ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితిలో మీరు కొత్త బైక్ కొనడానికి ఆలోచిస్తున్నట్లయితే దేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌లను కొనుగోలు చేయడం బెటర్. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

1. బజాజ్ ప్లాటినా 100

బజాజ్ ప్లాటినా 100 దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో 72 కి.మీ వరకు ప్రయాణించగలదని బజాజ్ పేర్కొంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 52,844 నుంచి ప్రారంభమవుతుంది. బజాజ్ ప్లాటినా 4 వేరియంట్లు, 10 రంగులలో లభిస్తుంది. ఇది కాకుండా వినియోగదారులు ఇందులో 102cc BS6 ఇంజిన్‌ను పొందుతారు.

ఇవి కూడా చదవండి

2. TVS స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్ మరో శక్తివంతమైన మైలేజ్ బైక్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 58,957. కంపెనీ ప్రకారం ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 70 కి.మీ వరకు సులభంగా నడుస్తుంది. TVS స్పోర్ట్ బైక్ 2 వేరియంట్లు, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో వినియోగదారులు 109.7సీసీ BS6 ఇంజిన్‌ను పొందుతారు.

3. బజాజ్ ప్లాటినా 110

ఇది బజాజ్ ప్లాటినా రెండో శక్తివంతమైన మైలేజ్ మోడల్. కంపెనీ దీనిని 2 వేరియంట్‌లు, 6 కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 64,547. ఈ బైక్ 70 kmpl మైలేజీని ఇస్తుంది. ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే ప్లాటినా 110 మోడల్ 115.45cc BS6 ఇంజన్ శక్తితో నడుస్తుంది.

4. బజాజ్ CT 100

బజాజ్ CT 100 మైలేజ్ పరంగా కంపెనీ ఉత్తమ బైక్. కంపెనీ ప్రకారం ఈ బైక్‌ 70 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.52,628 నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేవలం 1 వేరియంట్, 6 కలర్ ఆప్షన్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఇది 102cc BS6 ఇంజిన్ శక్తిని పొందుతుంది.

5. బజాజ్ CT 110

ఈ జాబితాలో బజాజ్ CT మోడల్‌కు ఇది రెండో బైక్‌ . కంపెనీ ప్రకారం దీని మైలేజ్ 70 kmpl. కంపెనీ దీనిని 2 వేరియంట్‌లు, 7 కలర్ ఆప్షన్‌లతో అందిస్తుంది. 115.45cc BS6 ఇంజన్ ఈ బైక్‌కు శక్తిని ఇస్తుంది. భారతదేశంలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 56,574.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి