Orbisk: ఫుడ్‌ వేస్టేజ్‌కు చెక్‌ పెట్టేందుకు టెక్నాలజీ సాయం.. నెదర్లాండ్‌ సంస్థ వినూత్న ఆలోచన..

Orbisk: ఓవైపు తినడానికి తిండి లేక అలమటించే వారు కొందరు, మరోవైపు అవసరానికి మించి అందుబాటులో ఉండి తినలేక ఆహారం పడేసే వారు మరికొందరు. ఇలాంటి భిన్నమైన పరిస్థితులను మనం చూస్తూనే ఉంటాం. ఆహారం వృథా చేయడం ఇప్పుడు..

Orbisk: ఫుడ్‌ వేస్టేజ్‌కు చెక్‌ పెట్టేందుకు టెక్నాలజీ సాయం.. నెదర్లాండ్‌ సంస్థ వినూత్న ఆలోచన..
Food Wastage
Follow us

|

Updated on: May 18, 2022 | 9:23 AM

Orbisk: ఓవైపు తినడానికి తిండి లేక అలమటించే వారు కొందరు, మరోవైపు అవసరానికి మించి అందుబాటులో ఉండి తినలేక ఆహారం పడేసే వారు మరికొందరు. ఇలాంటి భిన్నమైన పరిస్థితులను మనం చూస్తూనే ఉంటాం. ఆహారం వృథా చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి మించి పడేయడం వల్ల ఆహార సంక్షోభమే కాకుండా వాతావరణానికి కూడా హాని చేసిన వాళ్లం అవుతున్నాం.

ఓ అంచనా ప్రకారం పండిస్తున్న ఆహార పదార్థాల్లో మూటింట ఒక వంతు చెత్తకుప్పల్లోకే వెళ్తోంది. మరోవైపు తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతోన్నా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. అయితే ఈ ఫుడ్‌ వేస్టేజ్‌ సమస్యకు చెక్‌ పెట్టడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సంస్థ వినూత్న ఆలోచన చేసింది.

Food

నెదర్లాండ్స్‌కు చెందిన ఓర్‌బిస్క్‌ అనే సంస్థ ఓ వినూత్న పరికరాన్ని రూపొందించింది. చెత్తబుట్ట మీద అమర్చేలా ఉన్న ఈ పరికరానికి సెన్సర్‌ ఉంటుంది. దీంతో చెత్త వేసినప్పుడల్లా సెన్సర్‌ గమనిస్తుంటుంది. ఎంత ఆహారాన్ని పారేస్తున్నారు. ఎలాంటి ఆహారాన్ని పారేస్తున్నారు. ఏ సమయాల్లో వేస్తున్నారు లాంటి వివరాలన్నింటినీ నమోదు చేసుకుంటుంది. ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ గ్యాడ్జెట్  డ్యాష్‌ బోర్డ్‌పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చూపిస్తుంది. అలాగే చివర్లో అంతటినీ క్రోడీకరించి. మీకు ఎంత ఆహారం అవసరం, వృథాగా ఎంత పడేస్తున్నారన్న విషయాన్ని చెబుతుంది. జీవకోటి మనుగడకు ఆధారమైన ఆహారాన్ని వృథా చేయకుండా ఉండేందుకు ఈ కంపెనీ చేసిన ఆలోచన బాగుంది కదూ.!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..