AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Camera Phones: ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం ఈ మొబైల్స్‌ సూపర్.. ధర కూడా రూ. 20,000 కంటే తక్కువే..!

Best Camera Phones: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్‌లో మంచి కెమెరా ఉండాలని కోరుకుంటారు. అప్పుడే మంచి ఫొటోలు, ఉత్తమ సెల్ఫీలు తీసుకోవచ్చు.

Best Camera Phones: ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం ఈ మొబైల్స్‌ సూపర్.. ధర కూడా రూ. 20,000 కంటే తక్కువే..!
Best Camera Phones
uppula Raju
|

Updated on: May 18, 2022 | 9:18 AM

Share

Best Camera Phones: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్‌లో మంచి కెమెరా ఉండాలని కోరుకుంటారు. అప్పుడే మంచి ఫొటోలు, ఉత్తమ సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీమియం ఫోన్‌లు మాత్రమే మంచి నాణ్యత గల కెమెరాలను అందించేవి. కానీ నేడు మార్కెట్లో కెమెరా స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి చాలా కంపెనీలు మధ్య-శ్రేణిలో మంచి కెమెరాలను అందించడం ప్రారంభించాయి. దీంతో వినియోగదారులు కెమెరాతో పాటు నూతన ఫీచర్లను కూడా తక్కువ ధరలో పొందుతున్నారు. మీరు 20000 లోపు చౌకైన, ఉత్తమమైన కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే వీటి గురించి ఒక్కసారి తెలుసుకోండి.

1. Redmi Note 10 Pro Max: ఈ మొబైల్‌ ధర రూ. 19,999గా ఉంది. Redmi Note 10 Pro Max 108MP ప్రైమరీ కెమెరా, 5MP సూపర్ మాక్రో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుతూ.. ఇది 33W ఫాస్ట్ ఛార్జర్‌తో 5020mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కాకుండా ఇది 6.67-అంగుళాల FHD + సూపర్ AMOLED డిస్ప్లే, ఇది Qualcomm Snapdragon 732G చిప్‌సెట్‌తో ఉంది.

2. Realme 9 Pro: ఈ మొబైల్‌ ధర రూ. 18,999గా ఉంది. Realme 9 Pro గ్రీన్, బ్లాక్, సన్‌రైజ్ బ్లూ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది వెనుకవైపు 64MP+8MP+2MP కెమెరా సెటప్, ఫ్రంట్‌ వైపు16MP కెమెరాను కలిగి ఉంది. ఫోన్ ఇతర ఫీచర్లలో ఇది 2412×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల 120Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాటరీ ముందు భాగంలో ఇది 33W డార్ట్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ తో ఉంది. ఫోన్‌లో Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ అమర్చబడి ఉంది. ఇది గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

3. iQoo Z3: ఈ మొబైల్‌ ధర రూ.19,990 iQoo Z3 5G బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది వెనుకవైపు 64MP+8MP+2MP కెమెరా సెటప్, ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంది. ఇది 4,400mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 768 5G ప్రాసెసర్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది Android 11-ఆధారిత FuntouchOS 11.1పై పనిచేస్తుంది.

4. Realme 9 5G SE: ఈ మొబైల్‌ ధర రూ. 19,999 గా ఉంది. Realme 9 5G SE వెనుక 48MP+2MP+2MP కెమెరా సెటప్, ఫ్రంట్‌ భాగంలో 16MP కెమెరా ఉంది. ఇది 30W డార్ట్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 2412×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల 144Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 778 5G ప్రాసెసర్‌తో పాటు 8GB వరకు RAM, 128GB స్టోరేజ్ స్పేస్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 2.0 పై పని చేస్తుంది.

5. Poco X3 Pro: ఈ మొబైల్‌ ధర రూ. 19,999గా ఉంది. Poco X3 Pro బ్లాక్, బ్లూ, బ్రాంజ్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది 6.67-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 860 చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్‌ తో వస్తుంది. ఇది Android 11-ఆధారిత FuntouchOS 11.1లో పని చేస్తుంది. ఇందులో వెనుకవైపు 48MP+8MP+2MP+2MP కెమెరా సెటప్, ఫ్రంట్‌ వైపు 20MP కెమెరా ఉంది. ఇది 5,160mAh బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి