AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ముఖ్యంగా వారి కోసం.. త్వరలో సరికొత్త ఫీచర్..

త్వరలో WhatsApp గ్రూప్‌లో కొత్త ఫీచర్‌ని పొందబోతున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. ఇది త్వరలో విడుదల కావొచ్చు.

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ముఖ్యంగా వారి కోసం.. త్వరలో సరికొత్త ఫీచర్..
Whatsapp
Venkata Chari
|

Updated on: May 17, 2022 | 5:42 PM

Share

యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి WhatsApp తన ప్లాట్‌ఫారమ్‌కు తరచుగా కొత్త ఫీచర్లను జోడిస్తూనే ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కీలక ఫీచర్‌ను తీసుకరాబోతోంది. సాధారణంగా వాట్సాప్ గ్రూప్ నుంచి నిష్క్రమించిన తర్వాత సభ్యులందరికీ ఈ విషయం తెలియకూడదని చాలామంది కోరుకుంటుంటారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి WhatsApp ఒక ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొత్త అప్‌డేట్ తర్వాత, మీరు వాట్సాప్ గ్రూప్‌ను వదిలివేస్తే అడ్మిన్‌కు తప్ప ఎవరికీ తెలియకపోవడం విశేషం.

వాట్సాప్ ఫీచర్‌ను ట్రాక్ చేసే WABetaInfo కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, గ్రూప్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ నుంచి నిష్క్రమించిన నోటిఫికేషన్‌ను అందుకుంటారు. కొత్త ఫీచర్ స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది.

ఈ మేరకు యాప్‌లో సైలెంట్‌గా ఎగ్జిట్ గ్రూప్‌ అనే కొత్త ఫీచర్‌ను యాడ్ చేయనుంది. ఈ ఫీచర్ సహాయంతో, మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే, దాని గురించి ఎవరికీ తెలియదు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఈ ఫీచర్ కేవలం ఇతర సభ్యుల కారణంగా అనేక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి నిష్క్రమించలేని వ్యక్తులకు ఉపశమనం కోసం ఇలా చేస్తోంది.

వాట్సాప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్లు..

నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ WhatsApp Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే యాప్ ప్రస్తుతం గ్రూప్ సభ్యుల సంఖ్యను 512కి పెంచింది. ఇది గతంలో 256కి పరిమితం చేసింది.

Also Read: PM Narendra Modi: 5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు

Amazon Mega Summer Days Sale: హాట్‌ హాట్‌ సమ్మర్‌లో కూల్‌ ఆఫర్స్‌.. ఏసీ, ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్స్‌..