Central Government: కేంద్రం జోర్డాన్‌తో కీలక ఒప్పందం.. రైతులకి ఇక ఆ కొరత ఉండదు..!

Central Government: ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు మండిపోతున్నాయి. ఈ కారణంగా ఎరువుల కంపెనీలు తక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.

Central Government: కేంద్రం జోర్డాన్‌తో కీలక ఒప్పందం.. రైతులకి ఇక ఆ కొరత ఉండదు..!
Jordan Agreement
Follow us
uppula Raju

|

Updated on: May 18, 2022 | 10:32 AM

Central Government: ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు మండిపోతున్నాయి. ఈ కారణంగా ఎరువుల కంపెనీలు తక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఇది జరగదు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రసాయనాల, ఎరువుల మంత్రిత్వ శాఖ దాదాపు 3.5 మిలియన్ టన్నుల ఎరువుల సరఫరా కోసం జోర్డాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు కచ్చితంగా ఎరువులు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతానికి దేశంలో ఎరువుల కొరత లేదు. ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులకు సరిపడా సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని మాండవ్య తెలిపారు.

డాక్టర్ మాండవ్య నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం 2022 మే 13 నుంచి 15 వరకు జోర్డాన్‌ను సందర్శించింది. ఈ పర్యటనలో జోర్డాన్ ఫాస్ఫేట్ మైనింగ్ కంపెనీ (JPMC) వివిధ రకాల ఎరువుల సరఫరా కోసం భారతీయ ప్రభుత్వ, సహకార, ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. భారతదేశానికి ఫాస్ఫేటిక్, పొటాష్ ఎరువుల సరఫరాను నిర్ధారించడంలో జోర్డాన్ పర్యటన ఉపయోగపడిందని మాండవ్య అన్నారు. 5 సంవత్సరాల పాటు జోర్డాన్‌తో భారతదేశం దీర్ఘకాలిక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందని ఆయన చెప్పారు. భారతదేశంలో రాబోయే పంట సీజన్‌లో ఎరువుల సరఫరాకు హామీ ఇవ్వడానికి ఈ ఒప్పందం కీలకమని మంత్రి వివరించారు. రాబోయే కాలంలో ఎరువులు, వ్యవసాయం, ఆరోగ్య రంగాలలో కలిసి పనిచేయడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు.

దేశంలో ఏటా 3.25-3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగం జరుగుతుందని, ఖరీఫ్‌ సీజన్‌లో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేస్తున్నట్లు మాండవీయా తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, మిగిలిన 30 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను వివిధ దేశాల నుంచి ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల కొరత అపూర్వమైనప్పటికీ భారతదేశంలో లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, దీని ప్రత్యక్ష ప్రయోజనం వల్ల దేశంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం తగ్గుతుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి