Oral Cancer: యువతలో అధికంగా పెరుగుతోన్న పొగాకు ఉత్పత్తుల వాడకం.. 30 ఏళ్లలోపు వారికి ఓరల్ క్యాన్సర్..

పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీలు, గుట్కా వంటివి 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌లకు కారణమవుతున్నాయి. ధూమపానం చేయని వారితో పోలిస్తే ఇది నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పది రెట్లు పెంచుతుంది

Oral Cancer: యువతలో అధికంగా పెరుగుతోన్న పొగాకు ఉత్పత్తుల వాడకం.. 30 ఏళ్లలోపు వారికి ఓరల్ క్యాన్సర్..
Oral Cancer
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2022 | 7:31 AM

Oral Cancer: ధూమపానం, నికోటిన్(Tobacco Nicotine) ఆధారిత ఉత్పత్తులైన పొగాకు వంటి వాటిని నమలడం కొందరు ‘కూల్’గా భావించవచ్చు. అయితే  పొగాకు ఆకులు సిగరెట్‌లు, బీడీలు లేదా ముక్కుపొడులు ఇలా ఏవైనా ఏ రూపంలోనైనా సదరు వ్యక్తి ఆరోగ్యాన్ని ఏ   వయసులోనైనా నాశనం చేస్తాయి. పొగాకు వ్యసనం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటుంది. ఈ పొగాకు వ్యసనంతో అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తూ.. అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక మనదేశంలో కూడా పొగాకు వ్యాధికారకం అంటూ అనేక రకాల కార్యక్రమాలను చేపడుతున్నారు. థియేటర్లలో సినిమాని ప్రారంభించే ముందు తప్పనిసరిగా యాడ్స్ ను వేస్తున్నారు. అయినప్పటికీ పొగాకు ఉత్పత్తుల వాడకం యువతలో రోజు రోజుకీ అధికంగా పెరుగుతోంది.

ఊపిరితిత్తులు , నోటి క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు పొగాకు ఉత్పత్తులను వాడకం ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. అంతేకాదు ఇది హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల అంటువ్యాధులు, దృష్టి, వినికిడి లోపం, దంత సమస్యలు వంటి అనేక ప్రధాన వ్యాధులకు కారకం పొగాకు. ఎందుకంటే పొగాకులో విష పదార్థాలు, క్యాన్సర్ కారకాలు, నికోటిన్ వంటి అనేక శరీర ఆరోగ్యానికి హానికలిగించే పదార్ధాలున్నాయి.

పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీలు, గుట్కా వంటివి 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌లకు కారణమవుతున్నాయి.  ధూమపానం చేయని వారితో పోలిస్తే ఇది నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పది రెట్లు పెంచుతుంది. స్మోకింగ్‌ చేసేవారు బీడి, సిగరెట్‌, సిగార్‌, చుట్ట, రివర్స్‌ చుట్ట, హుక్కా ఇలా వేర్వేరు విధాలుగా పొగను పీలుస్తారు. ఏ రూపంలో పొగాకుని తీసుకున్నా.. అవి నోటి కుహరం, గొంతు లేదా వాయిస్ బాక్స్, అన్నవాహిక , ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధిని కలిగించగలవు. పొగాకును ఆకుల రూపంలో నమలడం ద్వారా అన్నవాహిక,  ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లతో పాటు పెదవులు, చెంప, చిగుళ్లు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం వేగవంతం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మౌత్ క్యాన్సర్ 

నోటి  క్యాన్సర్ .. తల, మెడ క్యాన్సర్ కు సంబంధించి ఉంటుంది. ఈ క్యాన్సర్ బారిన పడినప్పుడు నోటి కుహరంలో, నాలుక, దిగువ పెదవి, చిగుళ్ళు, దవడ లేదా నోటి నేలపై అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు మొదలవుతుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది అత్యంత సాధారణ నోటి క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్ పురుషుల కంటే.. మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. నోటి క్యాన్సర్ లో అనేక రకాలైన క్యాన్సర్లు ఉన్నాయి.  45 ఏళ్ళ .. లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నప్పటికీ.. ప్రస్తుతం 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. వివిధ రకాల నోటి క్యాన్సర్‌లు ఉన్నాయి. అయినప్పటికీ ఇతర రకాల క్యాన్సర్‌ల మాదిరిగానే, ముందస్తు రోగ నిర్ధారణ చేయడం వలన వ్యాధి తీవ్రత తొలగిస్తోంది.

లక్షణాలు:

పొగాకు క్యాన్సర్ కారకాలతో నిండి ఉంది. నోటి కుహరంలో జన్యుపరమైన మార్పులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే నోటిలో తెలుపు, ఎరుపు మిళితమైన మచ్చలు, గొంతునొప్పి కారణంగా బొంగురు పోయి ఉండటం, మింగడానికి ఇబ్బందికరంగా ఉండటం, దవడల భాగంలో వాపుగా రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, మాట్లాడటానికి కష్టంగా ఉండటం, అధిక తలనొప్పి, వినికిడిశక్తి తగ్గిపోవడం, చెవిపోటు.. ఇలా క్యాన్సర్‌ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. అయితే సమయానికి పరిష్కరించబడకపోతే నోటి కుహరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు.

నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలతో నిండి ఉన్నాయి. అవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఈ రసాయనాలు నోటి కుహరంలో జన్యుపరమైన మార్పులను ప్రేరేపించి నోటి క్యాన్సర్‌కు దారితీస్తాయి. జన్యుపరమైన తేడాలతో పాటు, కాల్చిన పొగాకు నుండి వెలువడే పొగ రేడియోధార్మిక పదార్థాలను విడుదల చేస్తుంది. కనుక దూమపానం చేసిన వారికి  క్యాన్సర్‌ను కలిగిస్తుంది.

పొగాకు ఉత్పత్తులను తీసుకునే అలవాటు వలన క్యాన్సర్ సోకదని అయితే చాలా మంది భావిస్తున్నారు. అయితే అలాంటివారు మరోసారి ఆలోచించాల్సి ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొగాకులో అనేక కారక పదార్ధాలు ఉన్నాయి. ఇక సిగరెట్ లో కూడా అదే స్థాయిలో ప్రమాదం కలిగిస్తుందని పేర్కొన్నారు.

కనుక నోటి క్యాన్సర్‌ను నిరోధించడానికి ఏకైక మార్గం పొగాకును విడిచిపెట్టి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. అయినప్పటికీ ధూమపాన వ్యసనాన్ని విడిచి పెట్టడం వీలుకాకుండా ఉన్నట్లు అయితే.. కౌన్సెలర్ల నుండి సహాయం పొందండి. (Source)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..