Peppermint: పుదీనా ఆరోగ్యానికే కాదు.. ఇంటి శుభ్రతలో కూడా బెస్ట్‌.. ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Peppermint: వేసవిలో పుదీనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. పుదీనా చర్మానికి చాలా మేలు చేస్తుంది. పుదీన చట్నీ

Peppermint: పుదీనా ఆరోగ్యానికే కాదు.. ఇంటి శుభ్రతలో కూడా బెస్ట్‌.. ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Peppermint
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2022 | 9:55 PM

Peppermint: వేసవిలో పుదీనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. పుదీనా చర్మానికి చాలా మేలు చేస్తుంది. పుదీన చట్నీ ఆకలిని పెంచుతుంది. పుదీనాలో మెంథాల్, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్, విటమిన్-ఎ, రైబోఫ్లావిన్, కాపర్‌, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పుదీన కడుపు సంబంధిత అనేక వ్యాధులను తొలగిస్తుంది. ఈ కారణంగా దీనిని ఎక్కువగా ఔషధాలలో ఉపయోగిస్తారు. పుదీనా ఆకులను తీసుకుంటే వాంతులు ఆగిపోయి కడుపులోని గ్యాస్ తొలగిపోతుంది. ఇది గడ్డకట్టిన కఫాన్ని కూడా బయటకు తీసుకొస్తుంది.పుదీనా ఇంటి పనులకి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల ఇంట్లో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌ను తొలగించవచ్చు. అయితే ఇంటి పనులలో పుదీనాను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

చీమలను తరిమికొట్టండి

వేసవిలో ఇంటి మూలల్లో చీమలు ఎక్కువగా ఉంటాయి. వీటని తరిమికొట్టడానికి మీరు పుదీనాతో చేసిన స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇంట్లో ఎక్కడ చీమలు కనిపించినా పుదీనా స్ప్రే చేస్తే అన్ని పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

బాత్రూమ్ క్లీనింగ్

బాత్రూమ్‌లోని మురికిని తొలగించడానికి మీరు పుదీనా సహాయం తీసుకోవచ్చు. బాత్‌రూమ్‌లో వచ్చే వాసన తొలగిపోతుంది. ఇందుకోసం పుదీనా ఆకులను నీళ్లలో గ్రైండ్ చేసి అందులో బేకింగ్ సోడా కలపాలి. ఇప్పుడు ఈ నీటిని బాటిల్‌లో నింపి మురికిగా ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఆపై బ్రష్ సహాయంతో శుభ్రం చేయాలి.

వంటగది క్లీనింగ్‌

వంటగదిలో పేరుకుపోయిన మురికిని, ఇక్కడ ఉన్న సింక్‌ను శుభ్రపరచడానికి మీరు పుదీనా సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో వెనిగర్ మిక్స్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇప్పుడు అందులో కొంచెం నీళ్లు మిక్స్ చేసి బాటిల్‌లో నింపాలి. దీనిని వంటగదిలో స్ప్రే చేయాలి. ఇలా మూడు వారాల పాటు స్ప్రే చేస్తుంటే చక్కటి మార్పు గమనిస్తారు. వంటగదిలో ఉండే క్రిములు ఈ స్ప్రే నుంచి పారిపోతాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..