Scientific Facts: నదిలో నాణెం వేయడం.. గుమ్మానికి నిమ్మకాయ కట్టడం.. శాస్త్రీయ కోణం ఏంటో తెలుసా..?

Scientific Facts: ఇంట్లో పెద్దలు ఎన్నో విషయాలు చెబుతారు. కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంటి బయట, దుకాణం బయట నిమ్మకాయలు,

Scientific Facts: నదిలో నాణెం వేయడం.. గుమ్మానికి నిమ్మకాయ కట్టడం.. శాస్త్రీయ కోణం ఏంటో తెలుసా..?
Scientific Facts
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2022 | 8:19 PM

Scientific Facts: ఇంట్లో పెద్దలు ఎన్నో విషయాలు చెబుతారు. కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంటి బయట, దుకాణం బయట నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం చాలా మంది చూసే ఉంటారు. ఇవి ఎందుకు అంటే దిష్టి తగలకుండా అని చెబుతారు. కానీ దీని వెనుక వాస్తవం వేరే ఉంది. నిజానికి నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మిరపకాయలు ఘాటుగా ఉంటాయి. తలుపు బయట వేలాడదీసినప్పుడు పుల్లని, ఘాటైన వాసన ఇంట్లోకి కీటకాలు, బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి మంచిది.

నదిలో నాణేలు వేయడం ఎందుకు..?

రైలు లేదా బస్సు నదిపై నుంచి వెళ్లేటప్పుడు చాలా మంది నదిలో నాణేలను విసిరేస్తారు. మీరు ప్రయాణంలో చాలాసార్లు ఈ విషయాన్ని చూసే ఉంటారు. కానీ ఇలా ఎందుకు చేస్తారో ఎవ్వరికి తెలియదు. నిజానికి పూర్వ కాలంలో రాగి నాణేలు వాడుకలో ఉండేవి. వీటికి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తి నది గుండా వెళ్ళినప్పుడల్లా ఒక రాగి నాణేన్ని నీటిలో విసిరేవాడు. క్రమంగా ఇది ఒక ట్రెండ్‌గా మారింది. ఈ రోజుల్లో రాగి నాణేలు లేవు అయినా నదిలో నాణేలు వేయడం మాత్రం ఎవ్వరూ మానుకోరు.

ఇవి కూడా చదవండి

పిల్లిని చూసి ఆగడం

మనం బయటికి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తారు. నిజానికి పూర్వ కాలంలో వ్యాపారులు ఎద్దుల బండ్లు, గుర్రాల మీద చాలా దూరం ప్రయాణించేవారు. రాత్రిపూట అడవి గుండా వెళుతున్నప్పడు పిల్లి కనిపిస్తే దాని కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఎద్దులు, గుర్రాలు ఈ మెరుపుని చూసి భయపడేవి. అందుకే వ్యాపారులు కొంత సేపు ప్రయాణం ఆపేసి జంతువులకి కొంతసేపు విశ్రాంతి ఇచ్చేవారు. ఈ విషయం అర్థంకాక ఇప్పటికీ చాలా మంది పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తారు.

మరిన్ని spiritual వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి