AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈరాశివారు అధికశ్రమ చేయాల్సి ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

చాలా మంది రోజులో తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 20వ తేదీ )శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఈరోజు ఈరాశివారు అధికశ్రమ చేయాల్సి ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: May 20, 2022 | 6:32 AM

Share

Horoscope Today (20-May-2022):  చాలా మంది రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 20వ తేదీ )శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్తే.. విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆయా రంగాల్లో ముందుకు వెళ్తే.. ఫలితాలను సొంతం చేసుకుంటారు. మానసిక ఆందోళనకు గురవుతారు. లేకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు అంటే గిట్టనివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ప్రారంభించిన పనులను ముందు చూపుతో పూర్తి చేయాల్సి ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల సహకారాలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు మానసికంగా ఇబ్బంది పడే వార్తను వింటారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దైవబలం కలదు. ఒక వ్యవహారంలో ఆచూతూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.  ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక నిర్ణయాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆర్ధికంగా శుభఫలితాలు అందుకుంటారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కీలక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలోచించి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read : 

నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
మాట నిలబెట్టుకుంటోన్న బండ్ల గణేష్.. 19న మరో సాహసానికి శ్రీకారం
మాట నిలబెట్టుకుంటోన్న బండ్ల గణేష్.. 19న మరో సాహసానికి శ్రీకారం
చింతపండుతో ఇన్ని వెరైటీలా? ఇలా చేస్తే నోరూరడం గ్యారెంటీ!
చింతపండుతో ఇన్ని వెరైటీలా? ఇలా చేస్తే నోరూరడం గ్యారెంటీ!