AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: గురువారం రాశిఫలాలు.. ఈరోజు ఈరాశివారు ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి ఉంటుంది..

రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు.

Horoscope Today: గురువారం రాశిఫలాలు.. ఈరోజు ఈరాశివారు ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి ఉంటుంది..
Horoscope Today
Surya Kala
|

Updated on: May 19, 2022 | 6:45 AM

Share

Horoscope Today (19-05-2022): వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. ఈరోజు తమ జాతకం ఎలా ఉంటుంది.. అని ఆలోచిస్తారు. అంతేకాదు రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 19వ తేదీ )గురువారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సి ఉంటుంది

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు తగిన ఫలాన్ని ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికీ ప్రోత్సాహంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్ కు తగిన ప్రణాళికలు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కీలక వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.   కొన్ని సంఘటనలు ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా పనులు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. చిత్తశుద్ధితో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. చేపట్టిన పనులను శ్రద్ధతో పూర్తి చేయాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శుభ వార్తలు వింటారు. మానసికంగా ధృడంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ముందగువేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఆత్మీయులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలను అందుకుంటారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ధైర్యంతో చేపట్టిన పనుల విషయంలో ముందడుగు వేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక నిర్ణయాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రతిభకు తగిన గుర్తింపు సొంతం చేసుకుంటారు. ఆర్ధికంగా శుభఫలితాలు అందుకుంటారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉత్సాహంగా పనిచేసి ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. కలహాలకు దూరంగా ఉండడం మేలు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన ఆలోచనలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. స్దాన చలన సూచనలు ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read : 

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ