Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన.

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు

AP CM Jagan: నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన.
Ap Cm Ys Jagan
Follow us
Surya Kala

|

Updated on: May 17, 2022 | 5:57 AM

AP CM Jagan: కర్నూలు జిల్లాలో(Kurnool District) నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుమ్మితం తండాలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు, గ్రీన్ కో (Greenko)ప్రతినిధులతో కలెక్టర్ కోటేశ్వరావు ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమ నిర్వహణను పక డ్బందీగా చేపట్టాలని ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులకు జిల్లా కలెర్టర్ ఆదేశించారు.

5,410 మెగావా ట్ల విద్యుత్ సామర్థ్యంతో గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించే పవర్ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తికి ఈప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదట కర్నూలు జిల్లాలో నిర్మితం అవుతుంది. హైడల్ పవర్ ప్రొడక్షన్ కోసం నీటిని రీసైకిల్ చేస్తారు. కలెక్టర్, ఎస్పీలు ఓర్వ కల్లు ఎయిర్పోర్టులో సీఎం పర్యటన ఏర్పాట్లపై డైరెక్టర్ విద్యాసాగర్ తో చర్చించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టారు.

రేపు ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి 5410 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించే పవర్ ప్రాజెక్టు శంకుస్థపన స్థాలానికి నేరుగా హెలి కాప్టర్ ద్వార చేరుకొని ప్రారంభిస్తారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు మాట్లడుతారు. అనంతరం మధ్యహ్నం 12.30 సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణానికి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకొని వెళ్తారు.

ఇవి కూడా చదవండి

Reporter :Nagi Reddy Kurnool, Tv 9 Telugu 

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..