APVVP Visakhapatnam Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో.. విశాఖపట్నం ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) కమిషనర్ కార్యాలయం.. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లో ఒప్పంద ప్రాతిపదికన ఆడియో మెట్రీషియన్, పోస్టుమార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ (Audiometrician Posts) పోస్టుల..
APVVP Visakhapatnam Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) కమిషనర్ కార్యాలయం.. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లో ఒప్పంద ప్రాతిపదికన ఆడియో మెట్రీషియన్, పోస్టుమార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ (Audiometrician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు: ఆడియో మెట్రీషియన్, పోస్టుమార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Coordinator of Hospital Services (APVVP), Government Hospital, Pendurti, Visakhapatnam.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 300
- వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.