Pre Diabetes: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అది ప్రీ డయాబెటీస్‌.. అవేంటంటే..?

Pre Diabetes: ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటే రక్తంలో సాధారణ చక్కెర స్థాయి కంటే ఎక్కువగా ఉందని అర్థం. దీనిని నిర్లక్ష్యం

Pre Diabetes: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అది ప్రీ డయాబెటీస్‌.. అవేంటంటే..?
Pre Diabetes
Follow us

|

Updated on: May 20, 2022 | 7:29 PM

Pre Diabetes: ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటే రక్తంలో సాధారణ చక్కెర స్థాయి కంటే ఎక్కువగా ఉందని అర్థం. దీనిని నిర్లక్ష్యం చేస్తే టైప్ 2 డయాబెటిస్‌ బారిన పడుతారు. ప్రీడయాబెటిస్ లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. USలో 20 ఏళ్లు పైబడిన 84 మిలియన్ల మందికి ప్రీడయాబెటిస్ ఉంది. కానీ 90% మందికి అది ఉందని తెలియదు. మీకు ప్రీడయాబెటిస్ ఉన్నట్లయితే మీ గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలకు దీర్ఘకాలిక నష్టం ఇప్పటికే ప్రారంభమై ఉండవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించడం చాలా ముఖ్యం. ప్రీడయాబెటిస్‌ని సూచించే కొన్ని ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం.

చర్మంపై నల్లటి మచ్చలు

ప్రీడయాబెటస్ వ్యక్తులలో చర్మంపై అక్కడక్కడ నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. చర్మంపై ముడతలు, మందపాటి పాచెస్ చూడవచ్చు. ఎక్కువగా ఈ పరిస్థితి మోకాలు వెనుక, పిడికిలి, మోచేతుల లోపల, మెడ మీద కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

నిద్ర లేమి

మీరు నిద్ర లేమితో బాధపడుతున్నారా? అయితే మీకు ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం రోజూ ఆరు గంటల కంటే తక్కువ నిద్ర పోయే వ్యక్తులలో ప్రీడయాబెటస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నాడీ వ్యవస్థ, నిద్ర బలహీనత మధ్య హార్మోన్ల సంబంధాల ఫలితంగా కూడా ప్రీ డయాబెటీస్‌ ఏర్పడుతుంది.

నోరు ఆరిపోవడం

ప్రీ డయాబెటీస్‌ వస్తే నోరు ఆరిపోతుంది. ఎప్పుడూ కూడా నోరు ఆరిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలియలేదు. కానీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇది ఒక లక్షణం.

తరచుగా మూత్ర విసర్జనకి వెళ్లడం

ఒక సగటు వ్యక్తి సాధారణంగా రోజుకు నాలుగు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. అయితే మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారు చాలా ఎక్కువగా వెళుతారు. అలాగే తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల మీకు చాలా దాహం వేస్తుంది. మీరు ఎక్కువగా తాగినప్పుడు ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?