Night Sweats Reasons: నిద్రపోతున్నప్పుడు చెమటలు పడుతున్నాయా..? ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..
పగటి పూట మత్రమే కాకుండా.. రాత్రిళ్లు కూడా ఎక్కువగా చెమట రావడం జరుగుతుంది. కేవలం వేసవిలోనే కాదు..
Night Sweats Reasons: వేసవిలో చాలా మందికి విపరీతంగా చెమటలు పట్టడం కామన్.. కానీ కొందరికి మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా చెమటలు పట్టేస్తుంటాయి. పగటి పూట మత్రమే కాకుండా.. రాత్రిళ్లు కూడా ఎక్కువగా చెమట రావడం జరుగుతుంది. కేవలం వేసవిలోనే కాదు.. ప్రతి సీజన్ లోనూ రాత్రిళ్లు పడుకున్న తర్వాత చెమటలు పడుతుంది. ఇలా రాత్రిపూట చెమట పట్టడం వలన అందరికీ చికిత్స అవసరం లేదని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది. సహజమైన గాలిలో నిద్రపోవడం.. కాటన్ బట్టలు ధరించడం.. చల్లని నీరు తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణమెంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మెనోపాజ్.. ఎన్హెచ్ఎస్ ప్రకారం.. మహిళలకు రాత్రిపూట చెమటలు పట్టినట్లు అయితే పీరియడ్స్ సమస్య ఉన్నట్లు అర్థం. ఈ సమయంలో హార్మోన్లలో మార్పుల కారణంగా వయసు పైబడిన మహిళలకు రాత్రి పూట ఎక్కువగా చెమట పడుతుంది. మహిళల వయస్సు 45-55 సంవత్సరాల మధ్య ఉంటే.. అధిక చెమటకు ఇది కూడా కారణమే..
ట్యాబ్లెట్స్.. విపరీతంగా మందులు వాడేవారికి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఎక్కువగా చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్హెచ్ఎస్ ప్రకారం.. చెమట కూడా మందుల దుష్ర్పభావమే.. యాంటిడిప్రెసెంట్స్, అనాల్జెసిక్స్ రాత్రి చెమటలకు కారణమవుతుంది.
తక్కువ చక్కెర స్తాయి… రక్తంలో తక్కువ చక్కెర స్థాయిని హైపోగ్లైసీమియా అని కూడా అంటారు. శరీరంలో బ్లడ్ షుగర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. మధుమేహం సమస్య ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉండి… రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయో వారికి రాత్రిళ్లు చెమటలు ఎక్కువగా పట్టేస్తుంటాయి. డాక్టర్ నెసోచి ఓకేకే-ఇగ్‌బోక్వే ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు అది అడ్రినలిన్ హార్మోన్ ను విడుదల చేయడం ప్రారంభిస్తుంది. అడ్రినలిన్ హార్మోన్ విడుదలైనప్పుడు చెమట గ్రంథులు సక్రియం చేయబడి చెమట పట్టేలా చేస్తుంది.
అంటువ్యాధులు.. రాత్రిపూట చెమటలు పట్టడం కూడా ఇన్ఫెక్షన్ కి సంకేతం కావచ్చు. ఇన్ఫెక్షన్ భారీన పడినప్పుడు రోగ నిరోధక శక్తి ఆ వైరస్ తో పోరాడుతుంది. ఆసమయంలో ఎక్కువగా చెమట జరుగుతుంది.
మద్యం.. రాత్రిళ్లు మద్యం తాగడం వలన కూడా నిద్రలో విపరీతంగా చెమట వచ్చేస్తుంది. ఆల్కహాల్ శరీరం గుండా వెళ్తున్న గాలి రంధ్రాలను అడ్డుకోవడం వలన ఈ సమస్య వస్తుంది. అలాగే ఆల్కహాల్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది చెమటకు దారి తీస్తుంది..
క్యాన్సర్.. రాత్రిపూట చెమట పట్టడం అనేది కొన్ని క్యాన్సర్లకు సంకేతం. ఇది సాధారణంగా లింఫోమా (రక్త క్యాన్సర్)లో కనిపిస్తుంది.
ఆందోళన.. అధికంగా చెమట పట్టడానికి ఆందోళన ప్రధాన కారణం. మనస్సు స్థిరంగా లేకపోవడం.. ఎక్కువగా ఆలోచించడం వలన హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీంతో విపరీతంగా చెమట పట్టడం జరుగుతుంది.
గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనల ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.. సందేహాలకు వైద్యులను సంప్రదించాలి.