నారింజ Vs జామ.. చలికాలంలో ఏ పండు తింటే మంచిదో తెలుసా?

24 December 2024

TV9 Telugu

TV9 Telugu

శీతాకాలంలో మార్కెట్‌లో రకరకాల సీజనల్ పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. రుచితో పాటు, పోషకాలు అధికంగా ఉండే సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా ఈ కాలంలో జామ, నారింజ పండ్లు రెండూ అధికంగా అందుబాటులో ఉంటాయి. ఈ రెండు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని పెంచుతుంది

TV9 Telugu

అయితే ఈ రెండింటిలో ఏ పండులో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుందో చాలా మందికి తెలియదు. నిజానికి ఈ రెండింటిలోనూ  శరీరానికి మేలు చేసే కీలక విటమిన్లు, ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అవసరమైన పోషకం. ఇది చర్మం మెరుస్తూ ఉండటానికి, ముడుతలను నివారించడానికి, గాయాలను నయం చేయడానికి చాలా అవసరం

TV9 Telugu

పులుపు, తీపి, వగరు కలగలిపిన రుచిలో ఉండే జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. USDA ప్రకారం 100 గ్రాముల జామపండులో మొత్తం 228 mg విటమిన్ సి ఉంటుంది

TV9 Telugu

ఎక్కువ పీచు, తక్కువ గ్లైసమెక్‌ ఇండెక్స్‌ ఉండే జామపళ్లు మధుమేహాన్ని పెరగకుండా చేస్తుంది. అధిక మోతాదులో లభించే విటమిన్‌-సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి

TV9 Telugu

మెగ్నీషియం ఇతర ఆహారం నుంచి పోషకాలను సరైన మోతాదులో స్వీకరించడానికి సాయపడుతుంది. ఇది కళ్ళు, చర్మం, జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది మరియు నోటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

ఇక నారింజలో కూడా 53.2 mg విటమిన్ సి ఉంటుందట. ఇది బ్లడ్ షుగర్ నిర్వహణ, రోగనిరోధక శక్తిని పెంచడం, హిమోగ్లోబిన్ పెంచడం, నీటి లోపాన్ని తీర్చడం, బీపీని నియంత్రించడం వంటి ప్రయోజనాలు అందిస్తాయి. ఈ రెండు పండ్లను చలికాలంలో పగలు తింటే మంచిది