వాటర్ మంచిదని ఎక్కువగా తాగుతున్నారా? బీ కేర్‌పుల్!
Velpula Bharath Rao
24 December 2024
వాటర్ ఆరోగ్యానికి మంచిదని తరచూ డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే అతిగా వాటర్ తీసుకోవడం కూడా మంచిది కాదని, కొన్ని సార్లు నీళ్లు ఎక్కువ తాగడం వల్ల ప్రాణానికి ప్రమాదని తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
వాటర్ తాగితే బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. బాడీలో ఉన్న వేస్టేజ్ అంత బయటకు పోతుంది. దీనికి తోడు బాడీలోని పార్ట్స్ పనితీరు కూడా బాగుంటుంది.
కానీ వాటర్ తాగుమన్నారు గానీ అని ఎడాపెడా తాగేస్తే చిక్కులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే ఓ మహిళ భారీగా వాటర్ తాగి ఆసుపత్రిలో చేరింది.
ఆమె ఉదయం ఏకంగా 4 లీటర్ల నీరు ఒక్కేసారి తాగింది. దీంతో ఒక్కసారిగా తలనొప్పి, వికారం అనిపించి వాంతులు చేసుకుంది. ఫిట్స్ వచ్చి ఆమె కిందపడిపోయింది
ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను చెక్ చేయగా హైపోనట్రేమియా సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
ఆమె బాడీలో సోడియం లెవల్స్ ఒక్కసారిగా పడిపోవడంతోనే పరిస్థితి విషయంగా మారినట్లు వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవ్వడంతో ప్రజలు వాటర్ ఎంత తాగితే మంచిదో తెలియక అయోమయంలో ఉన్నారు. రోజుకు 2 నుంచి 3 లీటర్ల వాటర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆ వాటర్‌ను కొద్ది కొద్దిగా తాగాలి. అయితే గంటకు 1.5 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగితే ‘వాటర్ ఇంటాక్సికేషన్" వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.