TOP 9 ET News: శంకర్ ప్రభాస్‌ను మరో రేంజ్‌లో ఊహించాడా ??
తానోటి తలిస్తే దైవం మరోటి తలిచినట్టు.. కరోనా టైంలో స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకటి తలిస్తే.. మరోటి జరిగిందట. ఎస్ ! శంకర్ కరోనా టైంలో.. ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని గట్టిగా అనుకున్నారట. ప్రభాస్‌తో మంతనాలు కూడా జరిపారట. కానీ కథ నచ్చలేదో.... లేక మన డార్లింగ్ బాబు డేట్స్ లేవో.. లేక ఇంకేదైనా జరిగిందో తెలీదు కానీ..ప్రభాస్‌తో శంకర్ చేయాలనుకున్న సినిమా అక్కడే ఆగిపోయిందట.
అయితే కాస్త ఆటీటుగా.. ఇదే విషయాన్ని డల్లాస్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు శంకర్. ఇక శంకర్ ఈ విషయాన్ని చెప్పడమే ఆలస్యం.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేయడం షురూ చేశారు. శంకర్ ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో ఊహించుకున్నాడో.. అది వర్కవుట్ అయితే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బయట ఓ ఇష్యూ హాట్ టాపిక్ అయితే చాలు.. సోషల్ మీడియాలో దానిపైనే చాలా మంది మాట్లాడుతుంటారు. వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అలా అల్లు అర్జున్ ఇష్యూపైనా.. కొందరు నెటిజన్లు.. అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు రియాక్టవుతున్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌తో ఇక నుంచి ఏ హీరో థియేటర్‌కు వెళ్లాలన్నా భయపడతారంటూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు. మీమ్స్ చేసి అక్రాస్ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ గ్యారంటీ
Sukumar: ఈసారి నేషనల్ అవార్డ్ చరణ్‌కే.. తేల్చేసిన సుకుమార్