ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కాలంతో పోటీ పడుతూ వేగవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా నిద్రలేమి సమస్య సర్వ సాధారణమైంది. చాలా మంది వ్యక్తులు నిద్ర పట్టక రాత్రంతా తిరుగుతూ ఉంటారు. మంచి సుఖ వంతమైన, ప్రశాంతమైన నిద్రను పొందలేరు. మంచి నిద్ర మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాదు మానసిక ప్రశాంతత, శక్తికి కూడా చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో నిద్ర లేమి నుంచి ఉపశమనం కోసం సహజమైన, సులభమైన పరిష్కారాన్ని కనుగొనడం అవసరం.