ఎండా కాలంలో చల్ల చల్లగా.. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా చేయాలి అంటే?
Samatha
07 march 2026
ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా లొట్టలేసుకొని మరి ఐస్ క్రీమ్ తింటారు.
ఐస్ క్రీమ్
ఇక సమ్మర్ ప్రారంభం అయ్యింది. దీంతో చాలా మంది ఈ సమయంలో ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడుతారు. అయితే బయట కొనుగోలు చేయకుండా ఇంటిలోనే ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పడు మనం చూద్దాం.
సమ్మర్
ఐస్ క్రీమ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరలీటర్ పాలు, చక్కెర రుచికి సరిపడ, బాదం పప్పులు, మొక్క జొన్న పిండి, వెన్న లేదా నెయ్యి.
కావాల్సిన పదార్థాలు
తయారీ విధానం.. ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి ,అందులో కప్పు చెక్కరె వేసి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరగబెట్టాలి. అందులో చెంచా నెయ్యి వేయాలి.
తయారీ విధానం
తర్వాత దీనిని బాగా కలిపి, అందులో బాదం, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మరో బౌల్ తీసుకొని, అందులో నెయ్యి రాసి, చక్కెర మిశ్రమాన్ని అందులో వేయాలి. అది గట్టిగా తయారు అవుతుంది.
చక్కెర మిశ్రమం
తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో పాలు పోసి, మరిగించాలి, మొక్క జొన్న పిండిని అందులో వేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. బాదం ,జీడిపప్పు పొడి వేయాలి. తర్వాత ఇందులో గట్టి పడిన చక్కెర మిశ్రమాన్ని మిక్సీ పట్టి ఇందులో వేయాలి.
పాలు
మంచిగా కలుపుతూ చల్లారని వ్వాలి. తర్వాత ఈ మిశ్రమంలో జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసి మంచిగా కలపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన్వాలి.
బాదం ముక్కలు
తర్వాత దీనిని ఒక డబ్బాలోకి తీసుకొని, రాత్రి మొత్తం ఫ్రిజ్‌లో పెట్టి, ఉదయాన్నే తీసి తింటే టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ, మరి మీరు కూడా ట్రై చేయండి.