అలర్ట్.. పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. మధుమేహానికి చికిత్స ఎందుకు లేదో తెలుసా..?
భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. మధుమేహంపై పరిశోధన కోసం దేశంలో బయోబ్యాంక్ కూడా ప్రారంభించారు.. డయాబెటిస్ అనేది ఒక వ్యాధి.. అంటువ్యాధి కానప్పటికీ.. దీనికి ఇప్పటివరకు సరిగా చికిత్స లేదు. దీనిని నియంత్రణలో మాత్రమే ఉంచుకోవచ్చు.. అయితే.. మధుమేహానికి ఎందుకు చికిత్స లేదు. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారనేది తెలుసుకోండి..
భారతదేశంలో డయాబెటిస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కేసుల సంఖ్య భారీగా పెరుతుండటం ఆందోళన కలిగిస్తుంది.. ఈ క్రమంలో భారతదేశంలో మధుమేహం నివారణ కోసం డయాబెటిస్ బయోబ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ డయాబెటీస్ బయోబ్యాంక్ ద్వారా మధుమేహ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స అందించవచ్చు. ఇది షుగర్ వ్యాధిని నివారించడానికి ఎంతగానో సహాయపడనుందని పరిశోధకులు భావిస్తున్నారు. దేశంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు మధుమేహ బాధితులుగా మారుతున్న నేపథ్యంలో శాస్త్రీయ అధ్యయనాలకు ఉపయోగపడే జీవ నమూనాలను సేకరించడం, వాటిని ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం ఈ బయోబ్యాంక్ లక్ష్యం..
ఐసీఎంఆర్ ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఈ వ్యాధి కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల వచ్చే ఈ మధుమేహం వ్యాధికి ఇప్పటి వరకు చికిత్స లేదు.. కానీ.. దీన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అమెరికా, రష్యా, ఐరోపాలోని అనేక దేశాలలో మధుమేహం పూర్తి చికిత్సపై అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.. అయితే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఔషధం లేదా వ్యాక్సిన్ తయారు చేయలేదు.
మధుమేహాన్ని ఎందుకు నయం చేయలేము.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సక్రమంగా పనిచేయక, షుగర్ లెవెల్ పెరిగితే మధుమేహం వస్తుందని ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ అజిత్ కుమార్ వివరించారు.. ఈ వ్యాధి దాని మూలాల నుంచి నిర్మూలించబడదు. మధుమేహానికి ఇప్పటి వరకు మందు కనుగొనబడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు..
మొదటి విషయం ఏమిటంటే అనేక రకాల హార్మోన్లు, ఎంజైమ్‌లు మధుమేహ వ్యాధిలో ఉంటాయి.. దాని సంక్లిష్టత కారణంగా, చికిత్స చేయడం కష్టం. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి కూడా వెళుతుంది. దీని వల్ల కూడా చికిత్స చేయలేమని వివరించారు..
శరీరంలో చక్కెర స్థాయి పెరిగిన తర్వాత మందులతో అదుపు చేయవచ్చని, అయితే ఒకసారి మధుమేహం వస్తే, ఈ వ్యాధికి కారణమయ్యే ప్యాంక్రియాస్ వంటి వివిధ ఎంజైమ్‌ల పనితీరును నియంత్రించడం ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్ అజిత్ వివరించారు. దీనివల్ల చికిత్స చాలా కష్టం అవుతుందని.. దీని కారణంగా, మధుమేహానికి సరిగా మందు కనుగొనబడలేదన్నారు..
ఏటా పెరుగుతున్న కేసులు
ICMR ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్లలోపు వారు కూడా మధుమేహ బాధితులుగా మారుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, చెడిపోయిన జీవనశైలి కారణంగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంటువ్యాధి కానప్పటికీ, మధుమేహం వేగంగా వ్యాప్తి చెందుతోంది.
దేశంలోనే తొలి బయోబ్యాంక్ ప్రారంభం..
మధుమేహంపై పరిశోధన చేయడానికి, దాని చికిత్స, నివారణపై పని చేయడానికి ICMR దేశంలోని మొట్టమొదటి బయోబ్యాంక్‌ను చెన్నైలో ప్రారంభించింది. దీని ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..