AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అసెంబ్లీ సమరానికి అంతా సిద్దం.. ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!

కేసీఆర్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న చర్చ జోరందుకుంది. పాలమూరు ప్రాజెక్ట్ విషయంలో సర్కార్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు కేసీఆర్. ఈ సమావేశాల్లో ప్రాజెక్టులపై, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చ జరిగుతుందని అధికార పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను కూడా సిద్ధం చేసుకుంది.

Telangana: అసెంబ్లీ సమరానికి అంతా సిద్దం.. ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
Telangana Assembly Sessions
Ravi Kiran
|

Updated on: Dec 29, 2025 | 7:29 AM

Share

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఐదు రోజులపాటు జరగనున్న సమావేశాల్లో నీళ్ల గొడవ నిప్పులు రాజేయనుంది. సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నామని బీఆర్ఎస్‌, బీజేపీ చెబుతుంటే.. విపక్షాలకు అస్త్రాలను చిత్తుచేసే పాశుపతాస్త్రం తమ దగ్గర ఉందని అధికార పార్టీ చెబుతోంది. దాంతో, చలిలో వేడి పుట్టించనున్నాయి అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపాతామంటోంది బీఆర్ఎస్. అలాగే, పాలమూరు ప్రాజెక్ట్ సహా కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలను సభలో లేవనెత్తుతామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్ కేసీఆర్.

హిల్ట్‌ భూములపై అసెంబ్లీలో చర్చించాలన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఫుట్‌బాల్‌ కోసం వందల కోట్లు వృధా చేశారని.. ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్న విషయాలను సభలో ప్రస్తావిస్తామన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు నెలరోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు మహేశ్వర్ రెడ్డి. మరోవైపు విపక్షాల విమర్శలన్నింటికీ కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ రెడీ అయింది. ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాలు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సర్కార్ ప్లాన్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు నీళ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తామంటోంది అధికార పార్టీ. కేసీఆర్ ఆరోపణలన్నింటికీ కౌంటర్ ఇస్తామంటోంది.

ఇక కాంగ్రెస్‌ నేతలు మొన్నటిదాకా కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారని.. ఒక్క ప్రెస్ మీట్ పెడితే వారం రోజులైనా ఆ సెగ నుంచి బయటపడలేకపోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే కేసీఆర్. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఈ సమావేశాలకు వస్తే రావొచ్చంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు