భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భీష్మనగర్ అటవీ ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసి మెడ కొరికిన పులి, తమ గ్రామాలపై ఎప్పుడు దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులి కదలికలపై ఆరా తీస్తూ, ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.