28 December 2025

అనుపమ పరమేశ్వరన్ ఉంగరాల జుట్టు రహస్యం ఇదే.. ఆ షాంపు వాడుతుందట..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాది సినిమా ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ బ్యూటీకి తెలుగులో క్రేజ్ ఎక్కువే.

ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది అనుపమ. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తన అందంతోపాటు తన కర్లీ హెయిర్ తో కుర్రవాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.  

ఈ మలయాళం భామ తన అందమైన శిరోజాల వెనుక దాగి ఉన్న బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. కురుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందట

ఉంగరాల జుట్టును మేనేజ్ చేయడం చాలా కష్టం కదా.. మీరెలా మేనేజ్ చేస్తారని చాలా మంది అడుగుతుంటారు అంటూ అసలు విషయం బయటపెట్టింది.

కర్లీ హెయిర్ మేనేజ్ చేయడం కష్టమే అని.. కానీ తాను తన జుట్టు కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడతానని అన్నారు. కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తుంటారట.

గ్లోయింగ్ స్కిన్ కోసం రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తుందట.

పదిహేను నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటానని.. ఇలా చేయడం వల్ల చర్మం నిగారింపుతోపాటు ముఖం మరింత అందంగా కనిపిస్తుందని తెలిపింది.