Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. తులం రేటు ఎంతంటే..!
Gold and Silver Rate in India: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పట్లే తగ్గేటట్లు లేదన్నట్లుగా బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు..

Gold and Silver Rate in India: బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మహిళలు బంగారం కొనాలంటే భయపడిపోతున్నారు. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 29న ధరలను పరిశీలిస్తే తులం బంగారం ధర రూ.1,41,210 ఉండగా, కిలో వెండి ధర రూ.2,50,900 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,810 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,990 వద్ద ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,440 వద్ద ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,360 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,590 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,440 వద్ద ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,440 వద్ద ఉంది.
2025 చివరి నెలలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ చాలావరకు ఆశాజనకంగానే ఉంది. క్రిస్మస్ వారంలో ఈక్విటీ మార్కెట్లు మొదటిసారి రికార్డు గరిష్టాలను చేరుకున్నాయి. పారిశ్రామిక, విలువైన లోహాలు బలమైన లాభాలను చవిచూశాయి. రాగి, వెండి రెండూ కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి.
బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి ?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా ఆర్థిక అనిశ్చితి, ప్రపంచ అస్థిరత ఉన్న వాతావరణంలో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ వంటి ప్రమాదకర పెట్టుబడుల నుండి డబ్బును ఉపసంహరించుకుని బంగారం, వెండిలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది రెండు లోహాలకు డిమాండ్‌ను పెంచుతుంది. డాలర్ బలహీనపడటం వల్ల బంగారాన్ని డాలర్లలో కొనుగోలు చేస్తారు. డాలర్ బలహీనపడినప్పుడు ఇతర కరెన్సీలను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు బంగారం చౌకగా మారుతుంది. ఇది డిమాండ్‌ను పెంచుతుంది. అలాగే ధరలను పెంచుతుంది.
తక్కువ వడ్డీ రేట్లు కూడా ఒక అంశం. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు బాండ్ల వంటి పెట్టుబడులు తక్కువ ఆకర్షణీయంగా మారతాయి. ఇది బంగారంపై ఆసక్తిని పెంచుతుంది.ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్నాలజీ (సోలార్ ప్యానెల్‌లు వంటివి), ఎలక్ట్రిక్ వాహనాలలో వెండికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణం. పండుగలు, వివాహాలకు డిమాండ్ కూడా ఒక అంశం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
