చిన్నవే కానీ గట్టివి.. చలికాలంలో రేగి పండ్లు తింటే ఎన్ని లాభాలో..

Samatha

28 December 2025

చలికాలంలో లభించే పండ్లలో రేగి పండ్లు ఒకటి. చాలా మంది రేగి పండ్లు తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు.

చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ రేగి పండ్లను చాలా ఇష్టంగా తింటారు. వీటిలో కాల్షియం, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటుంది.

అందువలన చలికాలంలో రేగి పండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

చూడటానికి చాలా చిన్నగా ఉండే రేగి పండ్లలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన కడుపు సమస్యలు తగ్గిపోతాయి.

ముఖ్యంగా కడుపులో మంట, అజీర్తి, గొంతు నొప్పి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

రేగి పండ్లలో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా జింక్, వంటివి అధికంగా ఉండటం వలన ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి.

రేగి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

అలాగే  ఇందులో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండటం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.