గ్రీన్ టీ ఇలా తాగారో అంతే.. మీ బండి షెడ్డుకే!

Samatha

27 December 2025

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

గ్రీన్ టీలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన దీనిని ప్రతి రోజూ తాగడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

అయితే గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, గ్రీన్ టీని ఈ విధంగా అస్సలే తాగకూడదంట. కాగా, దీని గురించి తెలుసుకుందాం.

ఆరోగ్యానికి మంచిది కదా అని గ్రీన్ టీ అధికంగా తాగకూడదంట. దీని వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉన్నదంటున్నారు నిపుణులు.

అలాగే కొంత మంది చాలా వేడిగా ఉన్న గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ ఇలా తాగడం కూడా మంచిది కాదంట, దీని వలన కడుపు సమస్యలు వస్తాయంట.

అదే విధంగా, ఖాళీ కడుపుతో టీ తాగడం కూడా అంత మంచిది కాదు, దీని వలన ఇందులోని కెఫిన్, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలకు కారణం అవుతుంది.

ఇక కొంత మంది గ్రీన్ టీలో చక్కెర కలుపుకొని తాగుతుంటారు. కానీ గ్రీన్ టీలో చక్కెర కలుపుకొని తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయంట.

అదే విధంగా రోజుకు రెండు కంటే ఎక్కువ కప్పులు అస్సలే తాగకూడదంట. దీని కంటే ఎక్కువ కప్పులు గ్రీన్ టీ తాగడం వలన గుండె సమస్యలు వస్తాయంట.