బంధం బలపడితే.. భాగస్వామి మీ నుంచి ఆశించనివి ఇవే!

Samatha

27 December 2025

ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే, ప్రేమ రెండు అక్షరాలు అయినా ఇది ఇద్దరు వ్యక్తుల జీవితం. ఇక ప్రతి ఒక్కరూ ఏదో విధంగా రిలేషన్‌లో ఉంటారు.

అయితే బంధం ప్రారంభంలోనే ఎన్నో సవాళ్లను సూచిస్తుంది.  భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఓదార్పునివ్వడం ఇలా చాలా ఉంటాయి.

అయితే బంధం బలపడే కొద్ది, మీ భాగస్వామి మీ నుంచి కొన్నింటిని ఆశించడం మానేయ్యడం, కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవడం జరుగుతుందంట.

రిలేషన్ ప్రారంభంలో మీ భాగస్వామి మీ నుంచి ఎప్పుడూ భరోసా కోరుకుంటారు. కానీ  బంధం బలంగా మారిన తర్వాత ప్రేమపై నమ్మకంతో, మీ నుంచి భరోసా కోరుకోవడం మానేస్తారు.

అలాగే, రిలేషన్ షిప్ ప్రారంభంలో, మీ భాగస్వామి తన భావాలను ఎక్కువగా చెప్తుంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒకరికి ఒకరు అంటూ అన్నీ నేర్చుకుంటారు.

అలాగే మెచ్యూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు తమ భాగస్వామి నుంచి గిఫ్ట్స్, త్యాగాలు, సందేహాలు లాంటివి ఆశించడం మానేస్తారు.

బంధం ప్రారంభంలో కొంత మంది తమ భాగస్వామితో ధైర్యంగా మాట్లాడాలి అంటే భయపడతారు, కానీ బంధం బలపడిన తర్వాత ప్రతి విషయాన్ని నిజాయితీగా మాట్లాడుతారు.

రిలేషన్ షిప్ ప్రారంభంలో మీ భాగస్వామి మీరు ఎప్పుడూ దూరంగా ఉన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ బంధం బలపడిన తర్వాత నమ్మకం, పెరుగుతుంది దూరాన్ని కూడా అర్థం చేసుకుంటారు.