పుణెలో ఓ ప్రేమ వివాహం 24 గంటల్లోనే విడాకుల నిర్ణయం వరకు దారితీసింది. డాక్టరైన భర్త తన మర్చంట్ నేవీ ఉద్యోగం గురించి, ఆరు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి తర్వాత చెప్పడంతో భార్య షాక్ అయ్యింది. ఈ విషయంపై గొడవ పెరిగి, 18 నెలల తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి.