5 నిమిషాల్లోనే అద్భుతం.. ప్రతి రోజూ పడుకునే ముందు ఇలా చేయండి!
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రమే హాయిగా నిద్రపోతారు. కొందరు ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్రపోరు. అయితే ఎప్పుడూ హాయిగా నిద్రపోవాలి అంటే, తప్పకుండా రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు ధ్యానం చేయాలంట. కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Sleeping
- నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రమే హాయిగా నిద్రపోతారు. కొందరు ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్రపోరు. అయితే ఎప్పుడూ హాయిగా నిద్రపోవాలి అంటే, తప్పకుండా రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు ధ్యానం చేయాలంట. కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
- ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఇది హృదయ స్పందన రేటులో మార్పు తీసుకురావడమే కాకుండా మెదడు భావోద్వేగ కేంద్రాన్ని కూడా ప్రశాంతపరుస్తుందట. ప్రతి రోజు నిద్ర పోయే ముందు ఐదు నిమిషాలపాటు నిశ్శబ్దంగా, కళ్లు మూసుకొని, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయడం వలన ఇది మీ మెదడును రీసెట్ చేసి, మంచి నిద్రను ప్రోత్సహిస్తుందంట.
- అంతే కాకుండా, ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, మెదడుకు విశ్రాంతినిస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన, అలసట నుంచి కూడా మిమ్మల్ని బయటపడేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తపోటును తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. భావోద్వేగ చర్యలను అదుపులో ఉంచి, శరీరానికి అలసటను తగ్గించి, మంచి వాతావరణాన్ని సృష్టిస్తుందంట.
- ఆరోగ్య నిపుణుల ప్రకారం, చాలా మంది ఉదయం వర్క్ ప్రెషర్, మానసిక ఆందోళన, టెన్షన్ వంటి వాటిని ఎదుర్కొని ఉంటారు. అయితే వాటి నుంచి బయటపడి మంచి నిద్రను పొందాలి అంటే తప్పకుండా రాత్రి పడుకునే ముందు కనీసం ఐదు నిమిషాలు ధ్యానం చేయాలంట. దీని వలన మెదడు వేగవంతమైన , బిజీగా ఉండే తరంగాల నుంచి నెమ్మదిగా నిశ్శబ్ద తరంగాల వరకు మారుతుందంట. శ్వాస లోతుగా వెళ్లడం వలన కండరాలు సడలించుతాయి. దీని వలన శారీరక ఉద్రేకం తగ్గుతుంది. మనసు తేలికపడుతుంది. హాయిగా నిద్రపడుతుందంట.
- అంతే కాకుండా ప్రతి రోజూ ఇలా కేవలం ఐదు నిమిషాల పాటు ధ్యానం చేయడం వలన ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, మెదడు ఆల్ఫా తరంగాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. అమిగ్డాలాను శాంత పరచడం వల్ల నిద్రలో ఆకస్మిక ఉద్రేకాలు తగ్గుతాయి. ముఖ్యంగా కొందరికి రాత్రి సమయంలో సడెన్గా మెలుకువ వస్తుంటుంది. సమస్య తగ్గపోతుంది. మానసికస్థితి మెరుగుపడుతుందంట.




